Sainik schools Admission Application Change : సైనిక పాఠశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌లో కీలక మార్పులు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : వచ్చే విద్యా సంవత్సరం (2024-25)లో 6, 9వ‌ తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ దరఖాస్తులకు గడువు నేటితో (డిసెంబ‌ర్ 16వ తేదీ శ‌నివారం) ముగియనుండంతో ఆ గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశాల‌కు డిసెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉండగా.. దాన్ని డిసెంబర్‌ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది.

అలాగే, ఈ పరీక్ష తేదీని జనవరి 21 నుంచి జనవరి 28(ఆదివారం)కి మార్పు చేసింది. పరీక్ష ఫీజును డిసెంబర్‌ 20 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్‌ 22 నుంచి 24వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పించారు.

☛ Sainik Schools: రక్షణ రంగంలో ఉన్నత స్థాయికి , ఉత్తమ మార్గం!.. దరఖాస్తు చివరి తేది ఇదే..

#Tags