AISSEE Counselling 2024: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలపై కీలక అప్‌డేట్‌

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సెలింగ్ (AISSAC), సీట్ల కేటాయింపు ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. దేశంలోని సైనిక్‌ పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 28న ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇదివరకే రాతపరీక్ష ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.

అనంతరం కౌన్సిలింగ్‌కు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ pesa.ncog.gov.in/sainikschoolcounselling ద్వారా సీట్ల కేటాయింపును చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అభ్యర్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఏప్రిల్‌ 10 ఉదయం 10 గంటలలోగా రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఏప్రిల్‌ 15న వీరికి వైద్య పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. NTA విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, విద్యార్థులు ఏప్రిల్ 27 లోపు తమ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. 

కాగా NTA వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొత్తగా ఆమోదించిన 19తో కలుపుకొని 52 సైనిక్‌ స్కూల్స్‌ ఉన్నాయి. అభ్యర్థుల మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌, రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయించారు.  మొత్తం 67% సీట్లను రిజర్వేషన్‌,స్థానికత ఆధారంగా కేటాయించారు.  33% సీట్లను ఇతర రాష్ట్రాలు,UTలకు చెందిన అభ్యర్థులకు కేటాయించారు.  
 

#Tags