ISRO NRSC Jobs Notification: ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(NRSC), తాత్కలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 71
ఖాళీల వివరాలు:

  • రిసెర్చ్ సైంటిస్ట్: 20 పోస్టులు
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 06 పోస్టులు
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి: 04 పోస్టులు
  • ప్రాజెక్ట్ అసోసియేట్-I: 02 పోస్టులు
  • ప్రాజెక్ట్ అసోసియేట్-II: 12 పోస్టులు
  • జూనియర్ రిసెర్చ్ ఫెలో: 27 పోస్టులు

అర్హత: సంబంధిత పోస్టులను బట్టి బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-04-2024.

#Tags