TS POLYCET: పాలీసెట్‌ అర్హులు 75 శాతం

TS POLYCET results 2022 details
  •     ఎంపీసీలో కరీంనగర్‌ విద్యార్థినికి 100% మార్కులు

  రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్‌–2022లో 75 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 1,04,362 మంది పరీక్ష రాస్తే.. 79,038 మంది అర్హులయ్యారు. ఈ మేరకు ఫలితాలను సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ జూలై 13న హైదరాబాద్‌లో విడుదల చేశారు. 120 మార్కులకు ఉండే ఈ పేపర్‌లో 30 మార్కులు సాధిస్తే అర్హతగా భావిస్తారు. ఎంపీసీ విభాగానికి  79,038  (75.73 శాతం) మంది, ఎంబైసీ విభాగానికి 79,117 (75.8 శాతం) మంది అర్హులయ్యారు. ప్రతి విద్యార్థి ఒకే పేపర్‌ రాసినప్పటికీ, ఎంపీసీ, ఎంబైపీసీగా రెండు ర్యాంకులు ఇస్తారు. అర్హత పొందిన విద్యార్థులు ఇంజనీరింగ్, నాన్‌–ఇంజనీరింగ్, అగ్రి కల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో చేరే వీలుంది. 

Also read: Plastic Pollution: New Age Technology

ఎంపీసీలో టాపర్‌ వర్షిత
ఎంపీసీ విభాగంలో కరీంనగర్‌ జిల్లా వావిలాలపల్లికి చెందిన గుజ్జుల వర్షిత 120 (100 శాతం) మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. సూర్యాపేటకు చెందిన చిత్తలూరి సాయి రోహిత్‌ 119 మార్కులతో రెండో ర్యాంకు పొందాడు. మొత్తం ఆరుగురికి ఈ విధంగా 120కి గాను 119 మార్కులు వచ్చాయి. వీరిలో సాయి రోహిత్‌తో పాటు సూరినేని భానుప్రసాద్‌ (సూర్యాపేట) కల్లివరపు చంద్రశేఖర్‌ (మేడ్చల్‌), గజ్జి నాగరాజు (సూర్యాపేట), వేమూరి వెంకట సాయి చిన్మయి (హైదరాబాద్‌), బానాల వసంత లక్ష్మి, (భద్రాద్రి కొత్తగూడెం) ఉన్నారు. ఎంబైపీసీ టాపర్స్‌లో కల్లివరపు చంద్రశేఖర్‌ (మేడ్చల్‌), వంచమణి శరణ్‌రెడ్డి (వరంగల్‌ అర్బన్‌), కడెం వినయ్‌ (రాజన్న సిరిసిల్ల), గనిపిశెట్టి మహాశ్వి (ఖమ్మం), కమ్మరి వంశీకృష్ణ (సంగారెడ్డి) వరుసగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంటర్, టెన్త్‌ పరీక్షల్లో మాదిరిగానే పాలీసెట్‌లోనూ అమ్మాయిలే ఎక్కువ శాతం అర్హత సాధించారు. ఎంపీసీలో 79.99%, ఎంబైపీసీలో 81.34% మంది ఉత్తీర్ణులయ్యారు.

Also read: UK PM Race: List of 8 Candidates

ఈ ఏడాది కొత్త కోర్సులు: నవీన్‌ మిత్తల్‌
ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఈ ఏడాది కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్‌కు ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇస్తాయని తెలిపారు. ఈసారి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో రద్దీ ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి అరగంటకు కేవలం ఆరుగుర్నే కౌన్సెలింగ్‌ కేంద్రానికి అనుమతించేలా చూస్తున్నామన్నారు. 

Also read: WEF Global Gender Gap Report 2021: మహిళా సాధికారత 135.6ఏళ్లు దూరం

పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ ముఖ్యమైన తేదీలు...
విషయం                     తేదీ
ఆన్‌లైన్‌ అప్లికేషన్, స్లాట్‌ బుకింగ్‌    18–20.7.22
సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌    20–23.7.22
ఆప్షన్లు పెట్టుకోవడం    20–25.7.22
సీట్ల కేటాయింపు    27.7.22
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌    27–31.7.22
చివరి దశ స్లాట్‌ బుకింగ్‌    1.8.22
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌    2.8.22
ఆప్షన్లు పెట్టుకోవడం    3.8.22
సీట్ల కేటాయింపు    6.8.22
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌    6–10.8.22
ఓరియంటేషన్‌    8–16.8.22
స్పాట్‌ అడ్మిషన్లు    8.8.22 నుంచి
తరగతుల ప్రారంభం    17.8.22

Also read: Book: నిరుద్యోగుల కోసం సబ్సిడీతో పోటీ పరీక్షల పుస్తకం

ఐఏఎస్‌ ఆఫీసర్‌నవుతా.. 
పాలీసెట్‌ కోచింగ్‌ లేకుండా రాశాను. స్టేట్‌ మొదటి ర్యాంకు వచ్చింది. మా అమ్మా, నాన్న.. సునీత, జీవన్‌రెడ్డి ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. వారి సలహాలు, సూచనలతోనే మొదటి ర్యాంకు సాధించగలిగాను. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలనేది నా కల. ఖచ్చితంగా సాధించి తీరుతాననే నమ్మకం ఉంది.    – గుజ్జుల వర్షిత, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ 

#Tags