Ph D Admissions : జేఎన్‌టీయూఏలో పీహెచ్‌డీ కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) పీహెచ్‌డీ కోర్సు (పార్ట్‌టైమ్‌/ఫుల్‌టైమ్‌)లో ప్రవేశాలకు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు, రీసెర్చ్‌ ప్రొఫెషనల్స్, పబ్లిక్‌ రిప్రజెంటేటివ్‌లు నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»    విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, మేనేజ్‌మెంట్, ఫుడ్‌ టెక్నాలజీ, ఇంగ్లిష్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్లు, జేఎన్‌టీయూ అనంతపురం, అనంతపురం చిరునామకు స్పీడ్‌ పోస్టు/కొరియర్‌ ద్వారా పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 04.09.2024.
»    వెబ్‌సైట్‌: www.jntua.ac.in

GATE 2025 Notification : ఎంటెక్ ప్ర‌వేశాల‌కు గేట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags