Constable Jobs Notification 2024 : ఈ నెల చివ‌రిలోనే భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం పోస్టులు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే పోలీసు కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ రానున్న విష‌యం తెల్సిందే. తెలంగాణ‌లో అయితే జాబ్ క్యాలెండర్ ప్ర‌కారం.. భారీగా కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల‌కు 2025 ఏప్రిల్ నెల‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు.

అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కూడా భారీగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం.. 2024 ఆగస్టు 27వ తేదీన ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 5వ తేదీ చివ‌రి తేదీ. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా.. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. 

☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

అర్హ‌త‌లు ఇవే..
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్య‌ర్థులు అర్హులు. 
పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంమీ, మహిళా అభ్యర్థులకు 157 సెంమీ ఉండాలి.

వయోపరిమితి : 
అభ్య‌ర్థులు 18 సంవ‌త్స‌రాల‌ నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది).

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1,2,3,4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఎంపిక విధానం : 
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

వేతనం :  
రూ.21,700- రూ.69,100 మధ్య జీతాలు ఉంటాయి.

#Tags