NEET UG Scam 2024 : రేపు భారీ ఎత్తున‌ స్టూడెంట్ మార్చ్‌.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్ యూజీ 2024 పరీక్షలో పలు చోట్ల కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వ‌స్తున్న విష‌యం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విద్యార్థులతో పాటు.. వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఈ నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

నీట్ యూజీ ప‌రీక్ష స్కాం, దీని ప‌రిష్కారం కోసం.. జూన్ 18వ తేదీన (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడ నుంచి లిబ‌ర్టీ వ‌ర‌కు భారీ ఎత్తున స్టూడెంట్ మార్చ్ నిర్వ‌హించ‌నున్నారు. NSUI స్టేట్ ప్రెసిడెంట్‌, MLC బ‌ల్మూరి వెంక‌ట్ నివాసంలో AISF, SFI, PDSU, VJS, PYC, DYFI, AIYF, PYL, YJS నేత‌లు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి.. స్టూడెంట్ ప‌వ‌ర్ చూపించాల‌ని వీరు పిలుపునిచ్చారు.

➤ NEET-UG Paper Leak: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి రియాక్షన్‌ ఇదే..

➤ NEET-UG Paper Leak Case Updates: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం.. వారి వద్ద నుంచి ఆరు చెక్కులు స్వాధీనం

#Tags