NEET UG Ranker Tanishka : నీట్ యూజీ ర్యాంకర్ టనిష్కా.. పరీక్షలో ఈ విధానాన్నే ఫాలో అయ్యాను..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రవేశ పరీక్షలో అత్యంత కష్టమైన పరీక్ష నీట్. ఇది సాధిస్తే ప్రభుత్వం కళాశాలలో సీటు లభిస్తుంది. ఈ సీటు పొందితే చాలు అనుకునేవారు ఎన్ని కష్టలైనా పడి చివరికి గెలుపును దక్కించుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్లలో ఒకరే ఈ యువతి. తన ఇంటర్ విద్యను పూర్తి చేసుకుంది. వెంటనే తన కల అయిన డాక్టర్ చదువు ప్రారంభించి కలను నెరవేర్చుకోవాలన్న ప్రయత్నం తనది. ఈ ప్రయత్నంలోనే నీట్‌కు సిద్ధమై ఉన్నత మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించింది. ప్రస్తుతం, మనం తెలుసుకోనున్న కథ ఈ యువతిదే..
Group-4 Rankers Success Stories : ఇలాంటి పనులు చేస్తూనే.. గ్రూప్-4 ఉద్యోగం కొట్టామిలా.. కానీ..!
డాక్టర్ కావడమే లక్ష్యంగా..
ఆమె పేరు తనిష్క.. హరిద్వార్‌కు చెందినది. అయితే, తనకు చిన్నతనం నుంచే ఉన్న ఒక కల డాక్టర్ కావాలని ఇందుకోసం కష్టపడి తన ఇంటర్మీడియట్‌ను ఉన్నత మార్కులతో పూర్తి చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు ఒక ఉత్తమ వైద్య కళాశాలలో సీటు పొందేందుకు రాయాల్సిన పరీక్షే నీట్ కాగా, ఒక ఇంటర్వ్యూలో తన ప్రయణం గురించి చెప్పుకొచ్చింది తనిష్క.
ఆమె కలలుగన్న హరిద్వార్‌లో డాక్టర్ కావాలనే ప్రయాణం మొదలైంది. తరువాత, ఆమె పాఠశాల రోజుల్లో, ఆమె కోటకు మారి, ప్రిపరేషన్ కోసం అలెన్ ఇన్స్టిట్యూట్‌లో చేరారు. ఆమె ఇప్పుడు నోయిడాలోని తన కాలేజీ హాస్టల్‌లో నివసిస్తోంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
అలెన్ ఇన్స్టిట్యూట్.. శిక్షణ రోజులు..
నీట్‌కు సిద్ధమైయ్యేందుకు ఒక ఉత్తమ ఇన్స్టిట్యూట్ (అలెన్)లో చేరి, అక్కడే శిక్షణ పొందింది తనిష్క. అయితే, ఈ ప్రయాణంలో తనకు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిన ఎంత నిరుత్సాపడినప్పటికి, తన కల తనను ఎప్పుడూ ప్రోత్సాహిస్తూ ఉండేదని చెప్పింది. అంతే కాదు, తన కోచింగ్ విధానాన్ని వివరిస్తూ.. ఉదయం సమయంలో కోచింగ్‌లో అయ్యాక, కాసేపు విశ్రాంతి తీసుకొని, శిక్షణ సమయంలో వివరించిన పాఠాలు, తీర్చుకున్న సందేహాలను తిరగేసుకుంది. అనంతరం, ఉపాధ్యాయులు శిక్షణలో చెప్పే ముఖ్యమైన అంశాలు, పాఠాలు చదివి, వాటిని ప్రాక్టీస్ చేసుకుంది. స్వయం శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు చెప్పే పాఠాలనే కాకుండా ఇతర విషయాలు.. అంటే, గతంలోని క్వశ్చన్ పేపర్లను కూడా తన ప్రిపరేషన్‌లో భాగం చేసుకొని పరీక్షకు సిద్ధమైంది. ఇలా, తన ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు ప్రిపేర్ అయ్యింది తనిష్క.
Success Story : అక్క.. తమ్ముడు.. అమ్మ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..
సెల్ఫ్ ప్రిపరేషన్
ఈ ప్రిపరేషన్‌లో భాగంగా తన చదువుకునే కార్యక్రమం పూర్యయిన వెంటనే తనకంటూ ఒక నోట్స్‌ను ప్రిపేర్ చేసుకునేది. అందులో ముఖ్యమైన అంశాలు, పాఠాలు, ప్రశ్నలు, గతంలో అడిగిన ప్రశ్నలు వంటివి రాసుకొని, రివిజన్ చేసుకుంది. తన ప్రిపరేషన్‌లో భాగంగా రోజుకు 7 నుంచి 8 గంటల వరకు చదివేవారు తనిష్క. తన ఉపాధ్యాయులు అందించే శిక్షణ మాత్రమే కాకుండా తానే స్వయంగా కొన్ని నోట్స్‌ను సిద్ధం చేసుకొని చదివేవారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
ప్రిపరేషన్ సమయంలో ఒక్కోసారి ఎంతో ఉత్తిడికి గురై చదువులో శ్రద్ధ ఉండేది కాదు. అటువంటప్పుడే తన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహకంగా నిలిచి, అన్ని విధాలుగా ధైర్యం చెప్పేవారు. తమ కలను సాకారం చేసుకునేందుకు చేయాల్సిన కృషి గురించి వివరించేవారు. ఒక్కోసారి చిన్న, పెద్ద పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన కూడా తనను ఒత్తిడికి గురికానివ్వలేదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
పరీక్షలో రెండు భాగాలుగా
తన ప్రిపరేషన్ విధానాన్ని నలుగురు అనుసరించేలా ఉన్నప్పటికి, పరీక్ష రాసే సమయంలో మాత్రం తన ఫాలో అయిన అంశాలు తనకు బాగా సహకరించాయని చెప్పుకొచ్చింది. ఈ అంశంలో మొదట తాను నమ్మిన, సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసి, తరువాత కష్టంగా ఉండే హైయ్యర్ లెవెల్ థింకింగ్ ప్రశ్నలను పూర్తి చేసింది. ఈ విధానం అందరికి ఉపయోగపడుతుందో లేదో కాని, తనకు మాత్రం ఎంతో ఉపయోగపడిందని తెలిపింది తనిష్క.
డాక్టర్ కల..
తన పరీక్షలు పూర్త చేసుకున్న తరువాత, తనకు వచ్చిన మార్కులకు తాను సాధించిన మార్కులకు తాను ఎంతో సంతోషించానని తెలిపారు. తన కల వైపుకు నడుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు తనిష్క. ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రుల ఆనందానికి అవదుల్లేవు.