NEET 2025 Preparation : మే 2025లో నీట్ ప‌రీక్ష నిర్వ‌హించే అవ‌కాశం.. ఈ విష‌యాల‌పై ప్రాధాన్య‌త పెంచాలి!

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–అండర్‌ గ్రాడ్యుయేట్‌.. నీట్‌–యూజీ! ఈ ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది!

ఇంటర్‌ బైపీసీలో చేరిన లక్షల మంది విద్యార్థులు తమ డాక్టర్‌ కలను నిజం చేసుకునేందుకు నీట్‌ యూజీకి ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. నీట్‌–2025ను మేలో నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఇంటర్మీడియెట్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఇటు బోర్డ్‌ పరీక్షల తోపాటు అటు నీట్‌లో ఉత్తమ ర్యాంకు కోసం సన్నద్ధత కొనసాగించాల్సిన ఆవశ్యకత. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ + నీట్‌ యూజీలో విజయానికి మెలకువలు.. 

బైపీసీ విద్యార్థులు నీట్‌పై ఎక్కువగా దృషి పెట్టి.. బోర్డ్‌ పరీక్షలను తేలిగ్గా తీసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. అయితే ఇది ఎంతమాత్రం సరికాదని, విద్యార్థులు బోర్డ్‌ పరీక్షలతోపాటు నీట్‌లో స్కోర్‌ కోసం పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Executive Posts : ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సమయ పాలన

బోర్డ్‌ పరీక్షలు, నీట్‌ యూజీ, ఈఏపీసెట్‌ల ఉమ్మడి ప్రిపరేషన్‌లో అత్యంత ప్రధానమైంది.. సమయ పాలన. నీట్‌ సిలబస్, బోర్డ్‌ సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించాలి. నీట్, బోర్డ్‌ సిలబస్‌లో కొన్ని కామన్‌ టాపిక్స్‌ ఉన్నాయి. ఆయా అంశాలను బోర్డు పరీక్షల కోసం ప్రిపేరవ్వాలి. నీట్‌ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. కామన్‌ అంశాలకు ప్రిపరేషన్‌ కొనసాగిస్తూనే.. ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌ కోసం నిర్దిష్ట సమయం కేటాయించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిపరేషన్‌ పరంగా రోజూ చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించాలి. టాపిక్స్‌ను విభజించుకొని.. ప్రతి రోజు అధ్యయనం సాగించాలి.
ప్రామాణిక పుస్తకాలు
బైపీసీ + నీట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్‌ లేదా పుస్తకాలను అనుసరించాలి. ఫ్యాకల్టీ, నిపుణులు, సీనియర్లను సంప్రదించి మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. నీట్‌ పరీక్ష పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం తప్పనిసరి. దీనివల్ల బోర్డ్‌ పరీక్షలకు కూడా సన్నద్ధత పూర్తవుతుంది.
Follow our YouTube Channel (Click Here)
బోర్డ్‌ పరీక్షలతో సమన్వయం
ఇంటర్‌ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్‌ ప్రిపరేషన్‌ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ఇంటర్‌ పరీక్షలకు ఒక నెల సమయం ఉందనగా నీట్‌ ప్రిపరేషన్‌ను పూర్తిగా పక్కన పెట్టి బోర్డు పరీక్షలపై దృష్టిపెట్టాలి. ఇంటర్మీడియెట్‌ పరీక్షల ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు ఇంటర్, నీట్‌ సిలబస్‌ను సమన్వయం చేసుకుంటూ చదవాలి. 
ఇంటర్‌ పరీక్షల తర్వాత
ఈ సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. డైరెక్ట్‌ కొశ్చన్స్‌ కంటే ఇన్‌ డైరెక్ట్‌ కొశ్చన్స్‌నే ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి మోడల్‌ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రిపరేషన్‌ సమయంలో షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. 
Akanksha Nitture: ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నమెంట్ విజేత తనీషా
అప్లికేషన్‌ దృక్పథం

ఇంటర్‌ బోర్డు ప్రశ్నలకు, నీట్‌లో, ఈఏపీసెట్‌లో అడిగే ప్రశ్నల తీరుకు వ్యత్యాసం ఉంటుంది. నీట్‌లో ప్రశ్నలను అప్లికేషన్‌ విధానంలో అడుగుతారు. వీటికి సమాధానం గుర్తించాలంటే.. మోడల్‌ ప్రశ్నలను ఎక్కువ ప్రాక్టీసు చేయాలి. తద్వారా మెరుగైన స్కోరును సాధించవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలో షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. దీన్నివల్ల సమయం ఆదా అవడంతోపాటు ముఖ్యమైన అంశాలపై ఏకాగ్రత నిలిపేందుకు అవకాశం ఉంటుంది. నీట్‌ బయాలజీ ప్రిపరేషన్‌కు సంబంధించి ఫ్లోచార్ట్‌లు, డయాగ్రామ్స్, షార్ట్‌ ట్రిక్స్‌ను ఉపయోగించాలి. 
ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌
బోర్డ్, నీట్, ఈఏపీసెట్‌ల అంశాలను చదవడంతోపాటు ప్రాక్టీస్‌ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాక్టీస్‌ సమయంలో.. నీట్, ఈఏపీసెట్‌ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను గుర్తించి విశ్లేషించుకోవాలి. క్లిష్టంగా అనిపించే ప్రశ్నలకు సంబంధించి రివిజన్‌ సమయంలో తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. 
Follow our Instagram Page (Click Here)
మాక్‌ టెస్టులు
బైపీసీ+నీట్‌ అభ్యర్థులు డిసెంబర్‌ నుంచి కనీ­సం నెల రోజులు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. ఇ­లా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌ టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్‌ వ్యూహాలను మార్చుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పరీక్షల సమయంలో కొత్త చాప్టర్లు, కొత్త అంశాల జోలికి పోకూడదు. ఆ సమయంలో కేవలం చదివిన వాటినే మళీ మళ్లీ రివిజన్‌ చేయాలి.
ప్రతి సబ్జెక్ట్‌ 130 టార్గెట్‌
నీట్‌లో మంచి స్కోర్‌ సాధించేందుకు ప్రతి సబ్జెక్ట్‌లో 180మార్కులకు గాను కనీసం 130మార్కులు పొందేలా ప్రిపరేషన్‌ సాగించాలి. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మా ర్కులు సాధించేలా కృషి చేయాలి. అదే విధంగా ఈఏపీసెట్‌లోనూ 180 మార్కులకు గాను కనీసం 110 మార్కులు స్కోర్‌ చేసేలా ప్రయత్నించాలి. 
ఈఏపీసెట్‌+నీట్‌
బోర్డ్‌ పరీక్షలు ముగిసిన తర్వాత నీట్, ఈఏపీసెట్‌లకు ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించాలి. నీట్‌కు, ఈఏపీసెట్‌కు మధ్య 20 నుంచి 30 రోజుల వ్యవధి ఉంటుంది. ముందుగా నిర్వహించనున్న పరీక్షపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 

IIT Jammu : ఐఐటీ జమ్మూలో 11 పోస్టులు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..!

సబ్టెక్ట్‌ వారీగా ముఖ్యాంశాలు
బోటనీ.. కాన్సెప్ట్‌లపై పట్టు

బోటనీకి సంబంధించి ఫిజియాలజీ ఆఫ్‌ ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, సెల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్‌ చాప్టర్‌ల కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్‌ అండ్‌ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇష్యూస్‌ పాఠ్యాంశాలపై ఫోకస్‌ చేయడం లాభిస్తుంది. ప్లాంట్‌ ఫిజియాలజీలో.. ప్లాంట్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్, మినరల్‌ న్యూట్రిషన్‌ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్‌ స్ట్రక్చర్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌లో కణ విభజన (సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్‌ నుంచి కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్‌ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి.
Join our WhatsApp Channel (Click Here)
జువాలజీ.. ప్రీవియస్‌ పేపర్స్‌
జువాలజీలో హ్యూమన్‌ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్‌ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్‌ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్‌ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్‌ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
ఫిజిక్స్‌
ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడరన్‌ ఫిజిక్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. నీట్‌లో ఇంటర్‌ రెండు సంవత్సరాల సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల  పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. 
కెమిస్ట్రీ.. రివిజన్‌ ప్రధానంగా
కెమిస్ట్రీలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మోల్‌ కాన్సెప్ట్, కెమికల్‌ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్‌ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్‌ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్‌ కెమిస్ట్రీ; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలను, వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. పీరియాడిక్‌ టేబుల్‌పై పట్టు సాధిస్తే ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందొచ్చు.  .

Join our Telegram Channel (Click Here)

#Tags