NEET UG 2024: నీట్‌ పరీక్ష దరఖాస్తుకు తేదీని పొడగించిన ఎన్‌టీఏ.. మరోతేదీ విడుదల..!

ప్రతీ ఏడాది నిర్వహించే నీట్‌ పరీక్షకు దరఖాస్తులకు తేదీ ప్రకటించారు. కానీ, ఇటీవలె ఆ తేదీని పొడగించి మరో తేదీని దరఖాస్తు చేసుకునేందుకు వివరాలను ప్రకటించింది ఎన్‌టీఏ. పూర్తి వివరాలను పరిశీలించండి..

సాక్షి ఎడ్యుకేషన్‌:   వైద్య వృత్తి.. ఒక పెద్ద బాధ్యత. అభ్యర్థుల సంఖ్య ప్రకారంగా ఇది భారత దేశంలోనే అతి పెద్ద పరీక్ష. దీంతో వైద్య విద్యను అందుకొని, వైద్య వృత్తిలో చేరే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో ఉన్నత మార్కులు సాధిస్తే దేశంలోని నలుమూలల్లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో, యూనివర్సిటీల్లోనూ సీటు లభిస్తుంది. అటువంటి ఈ పరీక్షకు దరఖాస్తుల తేదీని పొడగించింది ప్రభుత్వం. 

Internship to Job: ఈ సంస్థలో ఇన్‌టర్న్‌షిప్‌తోపాటు ఉద్యోగావకాశం

ఈ తేదీలోగా..

గతంలో ప్రకటించిన తేదీ కాకుండా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వారు తేదీని పొడగించి కొత్త తేదీని ప్రకటించారు. ఈ నెల 16వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుకు సమయం:

ఎలిజిబిలిటీ కమ్‌ ఎన్ట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ అండర్‌ గ్రాడ్యువేట్‌ (నీట్‌ యూజీ 2024) పరీక్షకు దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా exams.nta.ac.in/NEET/. వెబ్‌సైట్‌లో దరఖాస్తులు 16వ తేదీ రాత్రి 10:50లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే రోజు రాత్రి 11:50 నిమిషాలలోపు ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ ప్రకటించింది.

AP Inter Exams: ఇంటర్‌ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య..!

పరీక్ష తేదీ, కేంద్రాలు..

నీట్‌ 2024 ప్రవేశ పరీక్ష మే 5న ఒకే విడతలో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:20 నిమిషాలకు పూర్తవుతుంది. పరీక్ష రాసేందుకు ప్రభుత్వం 14 కేంద్రాలను నియమించింది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో రాసేది కాదు. అభ్యర్థులు కేంద్రానికి వచ్చి ఓఎమ్‌ఆర్‌ షీట్‌లో తమ జవాబులను ఇవ్వాల్సి ఉంటుంది. 

ఎన్‌టీఏ ప్రకటన..

పొడగించిన తేదీ గురించి ప్రకటించిన ఎన్‌టీఏ ఇక ఎటువంటి మార్పులు ఉండవని నిర్ధారించింది. అదే పద్ధతి, అదే విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టించారు. గతేడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సిలబస్‌ తప్ప మరే విధమైన మార్పులు లేవు. అన్ని నిభందనలు, పద్ధతులు ప్రతీ ఏడాది ఉండే విధంగానే వ్యాపిస్తాయి. 

AP Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఈనెల 31లోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

సం‍ప్రదించగలరు..

నీట్‌ పరీక్ష గురించి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు, సందేహాలు కలిగితే వారి నీట్‌ యూజీ వారి ప్రకటించిన 011-40759000 నెంబర్‌ను సంప్రదించడం లేదా neet@nta.ac.in కు మెయిల్‌ పెట్టడం చేసి తమ సందేహాలను అడగాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు exams.nta.ac.in/NEET/ and nta.ac.in ఈ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి అని ఎన్‌టీఏ వారు తెలిపారు.

#Tags