MBBS Seats: విద్యార్థులకు గుడ్ న్యూస్... ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు
తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. గతేడాది రాష్ట్రంలో 6,690 సీట్లు ఉండగా, ఈ ఏడాది కొత్తగా 1,450 సీట్లు అందుబాటులోకి రావడంతో మొత్తం సీట్ల సంఖ్య 8,140కి చేరింది. దీంతో ఈసారి నీట్ క్వాలిఫై అయ్యే ప్రతి నలుగురిలో ఒకరికి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి నీట్ రాస్తున్న వారిలో ఏటా సగటున 30 వేల మంది క్వాలిఫై అవుతున్నారు.
చదవండి: ముగిసిన నీట్ ఎగ్జామ్.. కీ కోసం క్లిక్ చేయండి
కొత్త కాలేజీల నిర్మాణం పూర్తవడం, సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా సుమారు 65 వేల మంది నీట్ రాశారు. ఎగ్జామ్ పేపర్ కూడా గతంలో వచ్చినంత టఫ్‌గా రాలేదు. దీంతో ఈసారి 35 వేల మంది వరకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు క్వాలిఫై అయిన ప్రతి నలుగురిలో ఒకరికి సీటు వచ్చే అవకాశం ఉంది.
☛ గుంటూరు వైద్య కళాశాలకు పీజీ సీట్లు మంజూరు
అంతేకాదు ప్రతి పది మందిలో ఒకరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే సీటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎయిమ్స్, ఈఎస్‌ఐసీ సహా 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 3,590 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇంకో రెండు కాలేజీలకు సంబంధించిన అనుమతులు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కూడా పర్మిషన్ వస్తే ఇంకో రెండొందల సీట్లు పెరుగుతాయి.
☛ ఏపీలో ఐదు కొత్త వైద్య కళాశాలల ప్రారంభం
అలాగే జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 4 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కాలేజీకి 150 సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేసింది. వీటితో కలిపి కాలేజీల సంఖ్య 28కి పెరగ్గా, సీట్ల సంఖ్య 4,550కు చేరింది. ఇందులో సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. వీటిల్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ కూడా అత్యంత తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ పూర్తి చేయనున్నారు.
☛ అయ్యో పాపం... నీట్ మిస్ అయిన తెలుగు విద్యార్థి.. 5 నిమిషాలు ఆలస్యమవడంతో నో ఎంట్రీ..!
☛ ఆ ఒక్క రాష్ట్రంలో తప్పించి.. ప్రారంభమైన నీట్.. సాక్షిలో నీట్ పేపర్‌తో పాటు కీ..!
ఎంబీబీఎస్‌తో పాటు బీడీఎస్, ఆయుర్వేదిక్ సీట్లను కూడా నీట్‌లో వచ్చే ర్యాంక్ ఆధారంగానే భర్తీ చేస్తారు. తెలంగాణలో 14 డెంటల్ కాలేజీల్లో 1,400 బీడీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ సీటు రాని వారు బీడీఎస్ వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఆయుర్వేదిక్(బీఏఎంఎస్), యునాని(బీయూఎంఎస్), సిద్ధ(బీఎస్‌ఎంఎస్) కోర్సుల సీట్లను కూడా నీట్ ర్యాంక్‌తోనే భర్తీ చేయనున్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ సీట్లను కూడా నీట్ ర్యాంక్‌తోనే భర్తీ చేసే అవకాశం ఉంది.