NEET-UG Paper Leak: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి రియాక్షన్‌ ఇదే..

న్యూఢిల్లీ:  నీట్‌–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్‌ లీక్‌గానీ, రిగ్గింగ్‌ గానీ జరగలేదని చెప్పారు. పేపర్‌ లీక్‌ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు.

NEET UG 2024 Latest Updates: నీట్-యూజీ పరీక్షపై వివాదం.. అనుమానాలను నివృత్తి చేస్తూ లిస్ట్‌ రిలీజ్‌ చేసిన NTA

 ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్‌ పరీక్ష నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు.  విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

#Tags