NEET-UG Controversy: 'నీట్‌' అక్రమాలపై సీబీఐ కేసు నమోదు.. పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ అక్రమాలపై దర్యాప్తు కోసం సీబీఐ రంగంలోకి దిగింది. కేసులో మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆదివారం వెల్లడించింది. గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నీట్‌ అవకతవకలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టారు. 

యూజీసీ–నెట్‌ పరీక్ష అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందంపై బిహార్‌లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామంలో శనివారం సాయంత్రం దాడి జరిగింది. సీబీఐ అధికారుల వాహనాలపై స్థానికులు దాడికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు గ్రేస్‌ మార్కులు సంపాదించిన 1,563 మంది అభ్యర్థుల్లో 813 మంది మళ్లీ నీట్‌–యూజీ పరీక్ష రాశారు. 

NEET Row 2024: పేపర్‌ లీక్‌ అయినా నీట్‌ పరీక్ష రద్దు చేయరా? కారణమేంటి

నీట్‌ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు: ఖర్గే
విద్యా వ్యవస్థలోకి పేపర్‌ లీకేజీలు, అవినీతి, అక్రమాలు, విఆ్య మాఫియా చొరబడ్డాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. నీట్‌–యూజీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

నీట్‌ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తముందని, వారిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. యువత భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారిందనేందుకు ఇదొక ఉదాహరణ అని రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వధ్రా అన్నారు. విద్యావ్యవస్థను మోదీ ప్రభుత్వం మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించిందని దుయ్యబట్టారు.
 

#Tags