NEET UG 2024: త్వరలోనే నీట్‌ యూజీ ప్రాథమిక కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్‌ యూజీ (NEET UG 2024) ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) త్వరలో విడుదల చేయనుంది. దీంతో పాటు ప్రశ్నపత్రం, అభ్యర్థల OMR ఆన్సర్‌ షీట్‌లను కూడా  NTA అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.

అభ్యర్థులు అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలతో నీట్‌ యూజీ ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మే5న దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో NEET UG పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

EWS Quota For Medical Colleges: అన్ని వైద్య కళాశాలల్లో రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరిగింది.దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షను నిర్వహిస్తారు. తుది ఫ‌లితాల‌ను వ‌చ్చే నెల 14వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. నీట్ యూజీ 2024 ప‌రీక్షకు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్​చేసుకోవచ్చు.
 

#Tags