NEET Controversy: 'నీట్‌' ఒక కుంభకోణం, కోచింగ్‌ సెంటర్లు, స్కూల్‌ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది.. సీఎం సంచలన వ్యాఖ్యలు

చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్‌ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్‌ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది. 

NEET-UG Paper Leak Case Updates: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం.. వారి వద్ద నుంచి ఆరు చెక్కులు స్వాధీనం

సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్‌ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్‌టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది.

Neet Ug Paper Leakage: నీట్‌ అవకతవకలపై ప్రత్యేక కమిటీని నియమించాలని కపిల్‌ సిబల్‌ డిమాండ్‌

గుజరాత్‌లో ఓఎంఆర్‌ షీట్లను ట్యాంపర్‌ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్‌ కోచింగ్‌ సెంటర్లు, ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్‌ పేర్కొన్నారు. 

#Tags