NEET 2024 Registration Date Extended: NEET UG 2024 దరఖాస్తు గడువు పెంపు
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ–2024 దరఖాస్తు గడువును మార్చి 16 దాకా పెంచుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయం తీసుకుంది.
పరీక్ష మే 5న జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. నీట్‌కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
మార్చి 9 నాటికే ఏకంగా 25 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఇది 4.2 లక్షలు ఎక్కువ. గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
#Tags