Medical Students Local Merit List: లోకల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేయాలి

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): వైద్య విద్యార్థులు తెలంగాణలో సీట్లు పొందేలా వెంటనే లోకల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేయాలని కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ దువ్వూరు ద్వారకనాథరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన ఐఎంఏ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ 2024–25కు సంబంధించి.. ఆల్‌ ఇండియా కోటాలో రెండు రౌండ్లు పూర్తయ్యాయని తెలిపారు. కానీ మెరిట్‌ లిస్ట్‌ లేనందున.. తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యార్థులు కనీసం రాష్ట్రంలోని మంచి కాలేజీల్లో సీట్లు పొందలేకపోతున్నారని వివరించారు.

చదవండి: NEET PG Admissions: నీట్‌ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు.. మెరిట్‌ లిస్ట్, ర్యాంకు కార్డులు ఇలా..

ఈ క్రమంలో త్వరలోనే నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి.. ఆల్‌ ఇండియా కోటాలో 3వ రౌండ్‌ కూడా డిసెంబర్‌ 27వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఆలస్యానికి గల కారణాలపై కాళోజీ వైద్య విద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి.. వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా వెంటనే లోకల్‌ మెరిట్‌ జాబితా విడుదల చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.  

#Tags