Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 28న జాబ్ మేళా.. ఈ జిల్లాలోనే!
సాక్షి ఎడ్యుకేషన్: తమ చదువులను పూర్తి చేసుకొని కొందరు విద్యార్థులు, బాధ్యతల కారణంగా చదువు మానుకొని ఉద్యోగం కోసం వేచి చూసే యువత మరోవైపు ఉన్నారు. వారి కోసమే ఈ జాబ్ మేళా. ముఖ్యంగా గిరిజన యువతకు ప్రభుత్వం ఈ మేళా నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లా ఉట్నూరు పట్టణంలో గిరిజన యువతి యువకుల కోసం ఈ నెలాఖరిలో అంటే, డిసెంబర్ 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
CBSE Schools Breaking News: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికిన డమ్మీ విద్యార్థులు!
అయితే, గిరిజన యువకులకు డిసెంబర్ 28న ఉదయం 10 గంటలకు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ వైటీసీ కేంద్రంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఈ మేళాను విజయవంతం చేయాలన్నారు. అంతేకాకుండా, మేళా సమయంలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నామని కుష్బూ గుప్తా స్పష్టం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)