Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం
కాళోజీ సెంటర్ : వరంగల్ ములుగు రోడ్డు సమీపం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి సీహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత, ఆసక్తిగల ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువకులు మాత్రమే తమ బయోడేటతోపాటు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో 30వ తేదీన ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం 9573885532 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
#Tags