AP Volunteers Recruitment 2023: వలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సాక్షి ఎడ్యుకేషన్ : కృష్ణా జిల్లాలో ఆయా గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్ల ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 321 వలంటీర్ల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్ http://40.81.241.107/apgv/vvRecruitmentNew.do లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 29వ తేదీలోగా పంపాలని పేర్కొన్నారు. గడువు ముగిసిన అనంతరం సంబంధిత ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ద్వారా మౌఖిక పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని వివరించారు.
#Tags