JEE Ranker Success Story : జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజ‌యం సాధించాలంటే.. టాప్ ర్యాంక‌ర్ చెప్పిన స‌క్సెస్ ఫార్ములా ఇదే..

మ‌న మీద మ‌న‌కు నమ్మకం, కష్టపడేతత్వం, సాధించాలనే తపన ఉంటే అసాధ్యమనేది ఏది ఉండ‌దు.

దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుగాంచిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ర్యాంక్ సాధిస్తే.. ఆనందంకు అవ‌ధులు ఉండ‌వ్‌. అలాగే తెలంగాణ‌కు చెందిన ఈ కుర్రాడు..జేఈఈ అడ్వాన్స్‌డ్ లో ఆలిండియా ఫ‌స్ట్‌ ర్యాంక్‌ సాధించి.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ కుర్రాడే.. చిద్విలాస్‌ రెడ్డి. ఈ నేప‌థ్యంలో చిద్విలాస్‌ రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేపథ్యం..

చిద్విలాస్‌ రెడ్డి.. మాది తెలంగాణ‌లోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట. అమ్మ నాగలక్ష్మి, నాన్న రాజేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఉంటాం.

☛ JEE Main 2024: జేఈఈ మెయిన్‌లో సిలబస్‌ మార్పులు... సన్నద్ధత ఇలా!

ఎడ్యుకేష‌న్ :
నేను 1వ‌ తరగతి నుంచి 3వ తరగతి వరకు నాగర్‌కర్నూల్‌లో, 4, 5 తరగతులు హస్తినాపురంలో, 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివాను. ఇక్కడే జేఈఈకి శిక్షణ తీసుకున్నాను. 

నా ప్రిప‌రేష‌న్ ఇలా..

నేను జేఈఈ పరీక్ష కోసం ప్రతి రోజు 15 గంటలు పాటు.. అది కూడా ప్రణాళికాబద్ధంగా చదివాను. సమయం వృథా చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సెల్‌ఫోన్‌తో టైంపాస్‌ చేయడం, క్రికెట్‌ తదితర వాటి కోసం సమయాన్ని వెచ్చించేవాడిని కాదు. నిమిషం వృథా చేయొద్దన్న ఆలోచనతో ప్రిపేరయ్యాను. ప్రిపరేషన్‌.. ఫోకస్‌ అంతా జేఈఈ పైనే. ఎప్పుడూ చదవడం మంచిది కాదని తల్లిదండ్రులు సలహాలిచ్చేవారు. విరామ సమయంలో రోజుకు అరగంట నుంచి గంటపాటు టీటీ, ఫూజ్‌ బాల్‌ అడుతూ ఒత్తిడి నుంచి బయటపడేవాడిని. దీంతో ప్రిపరేషన్‌ కష్టమనిపించలేదు. చదివే సమయంలో కూడా అరగంట విశ్రాంతి తీసుకునేవాడిని.

☛ JEE Mains 2024: లాజిక్‌ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్‌ కొట్టు!

కాలేజీలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆరోజు చదివేవాడిని. ప్రతి సబ్జెక్టునూ ప్రణాళిక ప్రకారం చదివాను. రెండు గంటలు గణితం, మూడు గంటలు ఫిజిక్స్‌కు కేటాయించి మిగిలిన సమయాన్ని వీలును బట్టి చదివాను. రాత్రిపూట కెమిస్ట్రీ పాఠాలను రివిజన్‌ చేశాను. నెగెటివ్‌ మార్కులుండటంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రశ్నలకే ఆన్సర్‌ చేశా. 360 మార్కులకు 341 మార్కులతో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాను.

జేఈఈ రాసే వారికి నా స‌ల‌హా..

ఇంటర్‌లో జాయిన్‌ అయిన దగ్గర నుంచి ప్రామాణిక పుస్తకాలను చదవడం తప్పనిసరి. మంచి బుక్స్‌ను ఒకటికి రెండు సార్లు చదవడం మేలు. మార్కెట్‌లో దొరికేవన్నీ ముందేసుకోవద్దు. వీలైనన్నీ ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాయాలి. ప్రణాళికతో చదవాలి. సబ్జెక్టు తప్ప మరేం చేయరాదు. ఆటంకాలను అధిగమించాలి. ప్రతి పనిలోను ఆటంకాలు తప్పక ఎదురవుతాయి. జాతీయస్థాయి పరీక్షలో విజయం సాధించాలంటే సంకల్ప బలం తప్పనిసరి. నేను చేసింది అదే. సోషల్‌ మీడియాకు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నాను. అప్పుడప్పుడు ఇండోర్‌గేమ్స్‌ ఆడటం. రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదవడం. ఫ్యాకల్టీ చెప్పినట్టు ప్రాక్టీస్‌ చేయడం వల్ల నేను విజయం సాధించగలిగాను.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

జేఈఈ మెయిన్‌కు ఇలా..
మొదట రెండేండ్లు అంటే జేఈఈ ఎగ్జామ్‌ నెల రోజుల ముందు వరకు జేఈఈ సిలబస్‌ను పూర్తిస్థాయిలో చదువుకోవాలి. తర్వాత నెల లేదా రెండు నెలల ముందు నుంచి జేఈఈ మెయిన్‌ ప్యాట్రన్‌ ప్రకారం ప్రిపరేషన్‌, ప్రీవియస్‌ పేపర్స్‌ సాల్వింగ్‌ చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటర్‌ అకడమిక్‌ పరీక్షలు పూర్తికాగానే తిరిగి జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ రాయాలనుకుంటే.. లేదా అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సిద్ధం కావాలి.

మాక్‌ టెస్ట్‌లను తప్పనిసరిగా..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం మొదట పరీక్ష స్వభావాన్ని తెలుసుకోవాలి. ప్రీవియస్‌ పేపర్లను బాగా సాల్వ్‌ చేయాలి. పరీక్షకు ముందు ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను బాగా చదవాలి. అదేవిధంగా కెమిస్ట్రీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. చదివే కాలేజీలో వారు పెట్టే మాక్‌ టెస్ట్‌లను తప్పనిసరిగా రాయాలి. దానిలో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోతే తప్పక విజయం సాధించవచ్చు.

ఎప్పటి నుంచి చదవాలంటే..?
నేను తొమ్మిదో తరగతి నుంచి జేఈఈకి ప్రిపరేషన్‌ ప్రారంభించాను. నిజానికి జేఈఈ ప్రిపరేషన్‌ అనేది విద్యార్థి స్థాయి బట్టి ఉంటుంది. కొంతమంది ఆరో తరగతి నుంచే ఫౌండేషన్‌ పేరిట చదువుతారు. కొంత మంది ఇంటర్‌లో చదివి కూడా మంచి ర్యాంక్‌ సాధించారు. అది వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించుకోవాలి.

☛ NTA: జేఈఈ మెయిన్స్‌ సిలబస్‌ మాదిరి ‘అడ్వాన్స్‌డ్‌’ మార్పులకు అవకాశం!

చదివిన పుస్తకాలు ఇవే..
నేను.. మ్యాథ్స్‌కు వినయ్‌ కుమార్‌, ఎస్‌ఎల్ చ‌దివాను. అలాగే ఫిజిక్స్‌కు హెచ్‌సీ వర్మ (2 వ్యాల్యూమ్స్‌), ఫిజిక్స్‌ గెలాక్సి, ఇర్డోవ్‌ (Irodov) ప్రిపేర‌య్యాను. అలాగే కెమిస్ట్రీకి ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి సంబంధించి హిమాన్షు పాండే, ఎంఎస్‌ చౌహాన్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీకి నీరజ్‌ కుమార్‌, ఇన్‌ ఆర్గానిక్‌ కోసం జేఈ లీ, కే కుమార్‌ పుస్తకాలను చదివాను. అలాగే ఎన్‌సీఈఆర్‌టీ కెమిస్ట్రీ తప్పనిసరిగా చదవాలి.

విజయం వెనుక..
నా విజయం నా తల్లిదండ్రులు, కాలేజీ ఫ్యాకల్టీ సపోర్ట్‌ వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా మా అన్న నాకు స్ఫూర్తి. అన్నయ్య ప్రస్తుతం బిట్స్‌ పిలానీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

#Tags