NTA: జేఈఈ మెయిన్స్ సిలబస్ మాదిరి ‘అడ్వాన్స్‌డ్’ మార్పులకు అవకాశం!
మేథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పది టాపిక్‌ల వరకూ తీసేశారు. ఇదే తరహాలో అడ్వాన్స్‌డ్‌లోనూ నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పె రుగుతోంది. అన్ని రాష్ట్రాలూ సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్‌టీఏ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు.
సిలబస్‌లో ఏ తరహా మార్పులు చేయాలనే అంశంపై పలు దఫా ల చర్చలు జరిగినట్లు ఎన్‌టీఏ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా 2020 నుంచి 2022 మధ్య బోధన పూర్తిస్థాయిలో సాధ్యపడనందున టె న్త్, ఇంటర్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించారు. 2024లో జరిగే జేఈఈ పరీక్షకు ఈ విద్యార్థులే హాజరు కా నుండటంతో జేఈఈ మెయిన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తున్నట్లు ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
విద్యార్థుల్లో ‘అడ్వాన్స్‌డ్’ఆందోళన...
గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ అర్హు ల్లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందికే అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఐదేళ్లుగా అ డ్వాన్స్‌డ్ రాస్తున్న వారి సంఖ్య 1.60 లక్షలు దాట డం లేదు. దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది పరీక్షకే హాజరు కావట్లేదని ఎన్‌టీఏ గుర్తించింది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభిస్తున్నా అన్ని ఐఐటీలలో కలిపి సీట్లు 16 వేలకు మించి లేవు. ఇందులోనూ టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన వరకే అగ్రశ్రేణి ఐఐటీల్లో సీట్లు వస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ పేపర్ కొన్నేళ్లుగా కష్టంగా ఉండటంతో విద్యార్థులు పోటీ పడేందుకు భయపడుతున్నారు.
జేఈఈ ర్యాంకుతో ఎన్‌ఐటీల్లో సీటు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిలబస్‌లో మార్పులు తేవాలని వివిధ రాష్ట్రా లు అడ్వాన్స్‌డ్ నిర్వాహక ఐఐటీలను డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో తొలగించిన టాపిక్స్ అడ్వాన్స్‌డ్‌లో కొనసాగించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
మేథ్స్‌లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు
నిపుణుల కమిటీ ఇటీవల ఎన్‌టీఏకు అందించిన నివేదిక ప్రకారం గణితంలో కొన్ని టాపిక్స్‌ను తొలగించే వీలుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్, టాన్జంట్స్ అండ్ నార్మల్స్, ప్లాన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్, మేథమెటికల్ రీజనింగ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వంటి టాపిక్స్ ఉండకపోవచ్చని సమాచారం.