JEE Advanced 2025 : జేఈఈ అడ్వాన్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. వీరు మాత్ర‌మే అర్హులు!

జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ షెడ్యూల్ ను విడుదల చేశారు అధికారులు.

సాక్షి ఎడ్యుకేష‌న్: బీటెక్ విద్యను ఐఐటీల వంటి ఉత్త‌మ క‌ళాశాల‌ల్లో లేదా యూనివ‌ర్సిటీల్లో ప్ర‌వేశం పొందేందుకు నిర్వ‌హించే ప‌రీక్ష జేఈఈ. ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ప‌రీక్షను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధిస్తే, బీటెక్‌లో ప్ర‌వేశం ద‌క్కుతుంది. వ‌చ్చే ఏడాది, మే 18, 2025న నిర్వహించనున్న జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ షెడ్యూల్ ను విడుదల చేశారు అధికారులు.

Education News: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తర్వాతే ఈఏపీ సెట్‌?

ప‌రీక్ష స‌మ‌యం:

ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ ప‌రీక్ష‌ను రెండు సెషన్లలో నిర్వ‌హిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలోని పేపర్ 1ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2ను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో అర్హత గలవారు మే 11 నుండి మే 18 వరకు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య ప‌రీక్ష‌కు సంబంధించిన‌ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

JEE Advanced 2025: మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌..

వ‌యోప‌రిమితి:

ఇక విద్యార్థుల వయస్సు ప్రమాణాలను వ‌స్తే అక్టోబర్ 1, 2000న లేదా ఆ తర్వాత జన్మించిన అభ్యర్థులు అయి ఉండాలి. అయితే, SC, ST, PwD కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

జిల్లాలు.. కేంద్రాలు..

తెలంగాణలో జేఈఈ అడ్వాన్స్ పరీక్షను రాసేందుకు 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు ప్రారంభించనుంది. అర్హులైన అభ్యర్థులు పరీక్ష ఫీజును మే 5వ తేదీన‌ సాయంత్రం 5 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వికలాంగులు (PwD) అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1600. ఇతర అభ్యర్థులకు రూ. 3200.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags