Intermediate Education : ఇంట‌ర్ విద్యావిధానంలో మార్పులు.. 23 ఆప్ష‌న్ల‌తో..!!

మ‌నం చ‌దువుకునే ప్ర‌తీ త‌ర‌గ‌తి ఒకేలా ఉండ‌దు. ఒక్కో త‌ర‌గ‌తి ఒక్కోలా ఉంటుంది. అలా, ఇంట‌ర్ కూడా ఒక‌టి. ఇందులో విద్యార్థులకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్: మ‌నం చ‌దువుకునే ప్ర‌తీ త‌ర‌గ‌తి ఒకేలా ఉండ‌దు. ఒక్కో త‌ర‌గ‌తి ఒక్కోలా ఉంటుంది. అలా, ఇంట‌ర్ కూడా ఒక‌టి. ఇందులో విద్యార్థులకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. వారి రెండు సంవ‌త్స‌రాల జీవితం మొత్తం చ‌దువుతోనే ముడిప‌డి ఉంటుంది. ఒక‌సారి ప‌రీక్ష‌లు అంటే, మ‌రోసారి రికార్డులు అని, మ‌రోసారి స్పెష‌ల్ క్లాసుల‌ని ఇలా వివిధ ర‌కాలుగా విద్యార్థులు టెన్ష‌న్‌తో ఒత్తిడికి గుర‌వుతూ ఉంటారు. ఇది ప్ర‌తీ ఇంట‌ర్ విద్యార్థి ప‌రిస్థితి అనే చెప్పాలి. అయితే, ప్ర‌స్తుతం, రెండు తెలుగు రాష్ట్రాల్లో మిన‌హాయిస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లేదు. విద్యార్థుల‌పై ఒత్తిడిని త‌గ్గించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయా కళాశాల‌ల యాజ‌మాన్యాలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.

JEE Main 2025 Preparation Strategies: జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు.. చివరి నిమిషంలో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే..

జాతీయ విద్యావిధానం..

ఈ నేప‌థ్యంలో మ‌న రాష్ట్రాల్లో కూడా విద్యార్థుల్లో చ‌దువు అనే ఒత్తిడిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు, విద్యా సంఘాలు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంట‌ర్ విద్యార్థుల‌కు సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది ఇంట‌ర్ బోర్డు. ఇక్క‌డ‌, జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలు చేయనున్నట్టు ఇటీవల ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా వెల్లడించారు. దీంతో, ఇంటర్ విద్య సీబీఎస్‌ఈ విధానంలోకి మారనుంది.

23 ఆప్ష‌న్లు..!

ప్రస్తుతం, ఇంట‌ర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోని ప్ర‌తీ గ్రూప్‌ల‌ విద్యార్థులకు రెండు భాషలతో పాటు ఆయా గ్రూపునకు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. అంటే, సైన్స్‌ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులు, ఆర్ట్స్‌కు మూడు సబ్జెక్టుల విధానం ఉంది. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులకు ఉన్న మ్యాథ్స్‌ పేపర్లను ఒకే పేపర్‌గా, బైపీసీ విద్యార్థులకు బోటని, జువాలజీని ఒకే పేపర్‌గా తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలో ఇంట‌ర్ బోర్డు యోచిస్తోంది.

Inter Board Exam Fees : ఇంట‌ర్ బోర్డు ఎగ్జామ్ ఫీజు చెల్లింపుకు గ‌డువు పెంపు.. ఆల‌స్య రుసుంతో..

రెండు సంవ‌త్స‌రాల‌ విద్యార్థుల‌కు ఇంగ్లీష్‌ సబ్జెక్టు కచ్చితంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ద్వితీయ సబ్జెక్టుగా ఏదైనా భాష కానీ లేదా ఇతర గ్రూపునకు చెందిన ప్రధాన సబ్జెక్టు కానీ ఎంపిక చేసుకోవచ్చ‌న్నారు. దీని కోసం 23 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఎంపీసీ చదివే విద్యార్థులు జువాలజీ, బోటనీ సబ్జెక్టు కానీ ఆర్ట్స్‌ సబ్జెక్టుగాని తీసుకోవచ్చు. మూడు, నాలుగు, ఐదో సబ్జెక్టులు ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. ఐచ్ఛికంగా 6వ సబ్జెక్టు ఉంటుంది.

ఈ విధానంలో కూడా భాష లేదా ఇతర గ్రూపుకు చెందిన 23 ఆప్షన్ల నుంచి ప్రధాన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానంగా ఎంచుకున్న ఐదు సబ్జెక్టులలో ఒకటి తప్పితే, ఆప్షన్‌ సబ్జెక్టు పాసైతే దానిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఉత్తీర్ణత చేస్తారు. దీని కోసం, ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో ఇంగ్లీష్‌ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటివరకు ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 500 మార్కులకు పరీక్షలు జరుగుతున్నాయి.

JEE(మెయిన్) 2025 : - జేఈఈ మెయిన్స్‌ 2025 సెషన్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

మార్కుల విధానం..

నూతన విధానంలో మార్కులు అదే మాదిరి ఉన్నా, ఉత్తీర్ణత శాతం కోసం ప్రథమ సంవత్సరం మార్కులు పరిగణనలోకి తీసుకోరు. ద్వితీయ సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణత శాతం కేటాయిస్తారు. ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకీ అంతర్గత మార్కులు ఉంటాయి. ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఇంగ్లీష్‌తో పాటు ఎంచుకున్న సబ్జెక్టుకు థియరీ మార్కులు 80, ఇంటర్నర్‌ మార్కులు 20 ఉంటాయి. సైన్స్‌ సబ్జెక్టులో థియరీ 70 మార్కులు, ఇంటర్నల్‌ 30 మార్కులు ఉంటాయి. ప్రశ్నాపత్రాల్లో ఒక మార్కు, 5,6 మార్కుల ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags