TS ICET: పరీక్ష తేదీలు
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష TS ICET–2022ను జూలై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TS ICET కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి జూలై 25న మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 4 మొత్తంగా 66 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి.. 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 75 మంది అబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 75,958 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయానికి విద్యార్థులు గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
చదవండి:
#Tags