Success Story: ఈ క‌సే.. న‌న్ను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయ్‌..

ఎన్పీడీసీఎల్‌లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్‌గా మంచి ఉద్యోగం.. మంచి జీతం ప్రశాంతమైన జీవితం.. కానీ చిన్నప్పటి నుంచి చూసిన కుటుంబ పరిస్థితులు.. పేద రైతులకు వ్యవసాయంలో వచ్చే నష్టాలను చూసి వారికి ఏదో చేయాలనే కోరిక గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేలా చేసిందని అంటున్నారు గ్రూప్-2లో మూడో ర్యాంకు సాధించిన వోలాద్రి నవత.
వోలాద్రి నవత

వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, ఎన్పీడీసీఎల్, గ్రూప్ 2లో డీటీతో కలిపి మొత్తం నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఆమెతో సాక్షిఎడ్యుకేషన్.కామ్‌తో ప్రత్యేక ఇంటర్వూ..

ప్రశ్న‌:  మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జవాబు: నాన్న వోలాద్రి సంజీవరెడ్డి. అమ్మ నీరజ. నాకు పెళ్లైంది. భర్త పేరు పుల్లం సాగర్ రెడ్డి.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

ప్రశ్న‌: విద్యాభ్యాసం ఎలా సాగింది?
జవాబు: మాది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలొని పసర గ్రామం. మాది సాధారణ వ్యవసాయ కుటుంబం కావడంతో మా ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు, ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజ్లో ఉచితంగా చదివే అవకాశం వచ్చింది.

ప్రశ్న‌: ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు.. ?
జవాబు: నా గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కుటుంబ పరిస్థితుల వల్ల నాకు పెళ్లి చేశారు. కానీ చిన్ననాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కోరిక ఉండడం వల్ల ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్నాను.

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

ప్రశ్న‌: ఎన్ని ఉద్యోగాలు కొట్టారు?
జవాబు: కష్టపడి చదివి.. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, ఎన్పీడీసీఎల్ లో ఉద్యోగాలు సాధించాను. ఎన్పీడీసీఎల్లో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ గా ఉద్యోగం జాయిన్ అయ్యా. మంచి జీతం కానీ ఎదో వెలితి. అందుకే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-2 కి ప్రిపరేషన్ ప్రారంభించా.

ప్రశ్న‌: కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది..?
జవాబు: నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేప్పటికే నాకు ఒక పాప ఉంది. మా తల్లిదండ్రులు, అత్తయ్య పాప ఆలనాపాలనా చూసుకునేవారు. నా భర్త నా ప్రిపరేషన్ కి అవసరమైన మెటిరీయల్ తెచ్చివడంతో పాటు.. ఎప్పుడు కాన్ఫీడెన్స్ కోల్పొకుండా నన్ను ప్రోత్సహించేవారు.

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

ప్రశ్న‌: ఏయే పుస్తకాలు చ‌దివారు..?
జవాబు: తెలుగు అకాడమీ బుక్స్ తో పాటు ఎక్స్ ట్రా సమాచారం కోసం ప్రతి సబ్జెక్టుకి వేరే బుక్స్ కూడా చదివాను.

ప్రశ్న‌: ఎన్పీడీసీఎల్ లో ఉద్యోగం.. మంచి జీతం అయినా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఎందుకు అనిపించింది?
జవాబు: మా నాన్న సాధారణ రైతు కావడంతో చిన్నప్పటి నుంచి వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసింది. పేదలకు, రైతులకు దగ్గరగా ఉంటూ, సాయం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఏలాగైనా ఉద్యోగం సాధించాలనుకున్నా. అందుకే గ్రూప్స్-2లో 3 ర్యాంకు వచ్చి, వేరే జాబ్స్ కి అవకాశం ఉన్నా కావాలని డిప్యూటీ తహసీల్దార్ పోస్టుని ఎంచుకున్నా.

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

ప్రశ్న‌: గ్రూప్స్ రాయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ?
జవాబు: గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వలనుకునేవారికి కమిట్మెంట్ ఉండాలి. ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఉద్యోగం రావడం కొంచెం లేటు అవ్వచ్చు. దాంతో చాలా మంది ప్రిపరేషన్ ఆపేసి వేరే జాబ్ చూసుకుంటారు. అలా మధ్యలో ఆపేయకుండా ఓపికగా ప్రయత్నించాలి.

ప్రశ్న‌: మీ ల‌క్ష్యం..?
జవాబు: గ్రూప్-1 ఉద్యోగం సాధించి, పేదవారికి సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను.

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

గ్రూప్‌–1 లో విజ‌యం సాధించానిలా..: హరిత, ఆర్డీఓ​​​​​​​

కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

#Tags