భారతదేశం - ఖనిజాలు

దేశ ఆర్థికాభివృద్ధిలో ఖనిజ సంపద కీలకపాత్ర పోషిస్తుంది. భారత దేశంలో బొగ్గు, ముడి ఇనుము, బెరైటీస్, బాక్సైట్, మైకా, మాంగనీస్, జిప్సం, డోలమైట్, సున్నపురాయి మొదలైన ఖనిజాలు అధిక సంఖ్యలో లభిస్తున్నాయి.
భారతదేశంలో ఖనిజాలు అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ‘ఛోటా నాగపూర్’ పీఠభూమిలో లభిస్తున్నాయి. అందువల్ల దీన్ని ‘రూర్ ఆఫ్ ఇండియా’గా పేర్కొంటారు. రూర్ అనేది జర్మనీలోని ప్రసిద్ధి చెందిన ఖనిజాల గని.
దేశంలోని ఖనిజాలను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1. లోహ ఖనిజాలు
ఎ. ఫై ఖనిజాలు: ఇనుము, మాంగనీస్, కోబాల్ట్, నికెల్ మొదలైనవి.
బి. నాన్ ఫై ఖనిజాలు: రాగి, సీసం, తగరం మొదలైనవి.
సి. విలువైన ఖనిజాలు: బంగారం, అల్యూమినియం, వెండి మొదలైనవి.
2. అలోహ ఖనిజాలు
మైకా (అభ్రకం), సున్నపురాయి, ముగ్గురాయి, రాతినార మొదలైనవి.
3. అణు ఖనిజాలు
యురేనియం, థోరియం, జెర్కోనియం, ఇల్మనైట్, టెటానియం మొదలైనవి.
4. ఇంధన ఖనిజాలు
బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు మొదలైనవి.

ఇనుము
ప్రపంచ ఇనుప ఖనిజ నిల్వల్లో 25 శాతం భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచ ఇనుము ఉత్పత్తిలో మనదేశానికి 5 శాతం వాటా ఉంది. ఇనుము ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇనుప ధాతువులో లభ్యమయ్యే ఇనుము శాతం ఆధారంగా ముడి ఇనుప ఖనిజాన్ని 4 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి:
మాగ్నటైట్: ఇది నలుపు రంగు నుంచి డార్‌‌క బ్రౌన్ వరకు వివిధ వర్ణాల్లో ఉంటుంది. ఇందులో 72 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అన్నింటి కంటే మేలైంది. ఈ రకమైన ఇనుము అగ్ని, రూపాంతర శిలల్లో ఎక్కువగా లభిస్తుంది.
హెమటైట్: ఇది ఎరుపు రంగులో ఉండి 70 శాతం వరకు ఇనుమును కలిగి ఉంటుంది. ఈ రకం ఇనుము ప్రపంచంలో ఎక్కువగా లభిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇది విస్తారంగా లభిస్తోంది.
లియోనైట్: ఇది బూడిద రంగులో ఉంటుంది. ఇందులో 40 నుంచి 50 శాతం వరకు ఇనుము ఉంటుంది. ఇది అవక్షేప శిలలో లభిస్తుంది.
సిడరైట్: ఇది అన్నింటికంటే నాసి రకమైంది. ఇందులో 35 శాతం కంటే తక్కువగా ఇనుము ఉంటుంది. దీన్నే ‘కార్బొనేట్ ఐరన్’ అంటారు. ఇది బొగ్గు గనుల సమీపంలో లభిస్తుంది. ఇది గోధుమ రంగులో ఉండే కర్బన ఇనుము.

దేశంలో ముఖ్యమైన ఇనుప గనులు
ఒడిశా: కియోంజర్, తాల్చేరు, మయూర్ భంజ్, సుందర్‌గర్.
జార్ఖండ్: సింగ్‌భమ్.
ఛత్తీస్‌గఢ్: దూర్‌‌గ, బస్తర్ (బైలదిల్లా గని).
కర్ణాటక: చిత్రదుర్‌‌గ, బళ్లారి, చిక్‌మంగుళూరు
ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, నెల్లూరు.
తెలంగాణ: ఖమ్మం, ఆదిలాబాద్.
మహారాష్ట్ర: చంద్రాపూర్, రత్నగిరి.
తమిళనాడు: సేలం.
  • భారతదేశంలో మొదటి ఇనుప గనిని 1904లో జార్ఖండ్‌లోని ‘సింగ్‌భమ్’లో కనుగొన్నారు.
  • భారతదేశంలో ఇనుము నిల్వలపరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరసగా.. 1. జార్ఖండ్, 2. ఒడిశా, 3. ఛత్తీస్‌గఢ్
  • ఇనుము ఉత్పత్తి పరంగా దేశంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు.. 1. ఒడిశా, 2. ఛత్తీస్‌గఢ్, 3. జార్ఖండ్
  • లోహాల్లో కెల్లా ఇనుము వాడకం ఎక్కువ. దీన్ని యంత్రాలు, యంత్ర పరికరాల తయారీలో విరివిగా వినియోగిస్తారు.
  • సల్ఫైడ్ల రూపంలో దీన్ని ఐరన్ పెరైట్స్, రబ్బరు పరిశ్రమల్లో వాడతారు.
మాంగనీస్
ఇది పైరోలుసైట్, సైలోమిలేన్, బ్రాకైట్, క్రిప్టోమిలాన్ లాంటి ధాతువుల నుంచి లభిస్తుంది. మాంగనీస్ ఎక్కువగా ‘ధార్వార్’ శిలల నుంచి లభిస్తుంది.
  • భారతదేశంలో మాంగనీస్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - ఒడిశా, కర్ణాటక.
  • దేశంలో మాంగనీస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు - మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.
దేశంలో ముఖ్యమైన మాంగనీస్ నిక్షేపాలు
ఒడిశా: కియోంజర్, కలహండి, కోరాపుట్
కర్ణాటక: షిమోగా, బెల్గాం, తుమ్కూరు.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విజయనగరం.
మధ్యప్రదేశ్: బాలాఘాట్, చింద్వారా బెల్ట్.
మహారాష్ట్ర: నాగపూర్, బండారా బెల్ట్.
మాంగనీస్‌ను బ్లీచింగ్ పౌడరు, నల్ల ఎనామిల్ తయారీలో; ఫొటోగ్రఫీ, తోళ్లు, గాజు పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు.

బాక్సైట్
దీన్నే ‘అల్యూమినియం ఆక్సైడ్’ అని కూడా అంటారు. దీని నుంచి అల్యూమినియంను సంగ్రహిస్తారు.
  • భారతదేశంలో బాక్సైట్ ఎక్కువగా ఒడిశా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది.
  • విమానాలు, ఆటోమొబైల్, ఓడలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన వస్తువులు, విద్యుత్ ఉపకరణాల తయారీలో బాక్సైట్‌ను ఉపయోగిస్తారు.
దేశంలో బాక్సైట్ లభించే ముఖ్యమైన గనులు
ఒడిశా: కలహండి, కోరాపుట్.
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి.
గుజరాత్: జామ్‌నగర్, కెరా, కచ్.
ఛత్తీస్‌గఢ్: బిలాస్‌పూర్, రాయ్‌గర్
మధ్యప్రదేశ్: జబల్‌పూర్, బాలాఘాట్.
కర్ణాటక: కెమ్మనగండి.
  • మనదేశం నుంచి బాక్సైట్‌ను ఎక్కువగా ఇటలీకి ఎగుమతి చేస్తున్నారు.
రాగి
దీన్ని నాణేల తయారీలో అధికంగా ఉపయోగిస్తారు.
  • పారిశ్రామికంగా ఇనుము తర్వాత ముఖ్యమైన ఖనిజం రాగి.
  • రాగి అత్యుత్తమ విద్యుత్ వాహకం. కాబట్టి దీన్ని ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • రాగి ఇతర లోహాలతో సులభంగా మిళితం అవుతుంది. రాగి, జింకుతో కలిస్తే.. ‘ఇత్తడి’ ఏర్పడుతుంది. రాగి, తగరంతో కలిస్తే.. ‘కంచు’ ఏర్పడుతుంది. రాగి, జింకు, నికెల్‌ను కలిపి ‘జర్మన్ సిల్వర్’ను రూపొందిస్తారు.
  • భారతదేశంలో రాగి ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం ‘రాజస్థాన్’.
దేశంలోని ముఖ్యమైన రాగి నిక్షేపాలు:
రాజస్థాన్:
ఖేత్రి, ఆల్వార్, జైపూర్.
ఆంధ్రప్రదేశ్: అగ్నిగుండాల (గుంటూరు).
మధ్యప్రదేశ్: మలజ్‌ఖండ్, బాలాఘాట్.
జార్ఖండ్: సింగ్‌భమ్, హజారీబాగ్.
తమిళనాడు: దక్షిణ ఆర్కాట్.
కర్ణాటక: హసన్.
హిమచల్‌ప్రదేశ్: కాంగ్రా.

బంగారం
బంగారాన్ని ‘నోబుల్ మెటల్’ అంటారు. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో 0.75 శాతం మనదేశంలో ఉత్పత్తి అవుతోంది.
  • బంగారం క్వార్‌‌ట్జశిలల నుంచి లభిస్తుంది.
  • భారతదేశంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - కర్ణాటక.
భారత్‌లోని ముఖ్యమైన బంగారం గనులు:
కర్ణాకట:
కోలార్, హట్టి.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలోని రామగిరి.
తమిళనాడు: కోయంబత్తూరు, నీలగిరులు.
కేరళ: కోజికోడ్.

క్రోమైట్
ఇది క్రోమియం నుంచి లభిస్తుంది. దీన్ని ‘స్టెయిన్‌లెస్ స్టీల్’ తయారీలో ఉపయోగిస్తారు.
  • మనదేశంలోని క్రోమియం నిక్షేపాల్లో సుమారు 90 శాతం ఒడిశాలోనే ఉన్నాయి.
  • క్రోమైట్‌ను అధికంగా జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
దేశంలోని ముఖ్యమైన నిక్షేపాలు
ఒడిశా: కియోంజర్, కటక్.
మహరాష్ట్ర: రత్నగిరి, భాండార్.






















































#Tags