2019 గ్లోబల్ ఇన్నోవేషన్ సూచీలో భారతదేశ స్థానం?

దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తప్పకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిరంతరం నమోదవుతున్న సమకాలీన అభివృద్ధి నేపథ్యంలో అభ్యర్థులు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పరీక్షల్లో విజయం సాధించడానికి ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలి? ప్రశ్నల సరళికి అనుగుణంగా ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహాన్ని అనుసరించాలో తెలుసుకుందాం!
  • సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం డేటా ఆధారంగానే కాకుండా టెక్నికల్ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకుని ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు శక్తి వనరులు టాపిక్ చదివేటప్పుడు సంప్రదాయ, సంప్రదాయేతర శక్తి వనరులు, రకాలు, దేశంలో వాటి స్థూల, స్థాపిత సామర్థ్యం, రాష్ట్రాల వారీగా ఉత్పాదన వంటి అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే సరిపోదు. ఫ్యూయల్ సెల్ అంటే ఏమిటి? దాని పనితీరు ఎలా ఉంటుంది?,దేశంలోని 3 దశల అణుశక్తి కార్యక్రమాల మధ్య భేదాలు ఏమిటి?, షేల్ గ్యాస్‌ను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు?, సముద్ర శక్తిలో ఓషన్ వేవ్, ఓషన్ థర్మల్, టైడల్ శక్తి మధ్య తేడా ఏముంటుంది?, జియో థర్మల్ శక్తి ఉత్పాదన విధానం ఏమిటి?, ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీ సామర్థ్యం, పనితీరు ఏమిటి?, స్మార్ట్ గ్రిడ్ ఏ విధంగా పనిచేస్తుంది? వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
  • అంతరిక్ష, రక్షణ, సమాచార సాంకేతిక రంగాలు, బయో టెక్నాలజీ, శక్తి రంగంలోని మూల అంశాలతో పాటు ప్రస్తుత కాలంలో ప్రముఖంగా వార్తల్లో ఉన్న నానో టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, బిగ్ డేటా, కృత్రిమ మేధ, జీన్ ఎడిటింగ్, బాహ్య రోదసి అన్వేషణ, గురుత్వాకర్షణ తరంగాలు, రొబోటిక్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. పరీక్షల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించే స్థాయిలో ఒక్కో అంశంపై ప్రత్యేకంగా నోట్స్‌ను తయారు చేసుకోవాలి.
  • సివిల్స్ ప్రిలిమ్స్ నుంచి రాష్ర్ట స్థాయిలో జరిగే ప్రతి పరీక్షలో మారుతున్న ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేరేషన్‌ను సాగించాలి. అభ్యర్థుల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అధిక మార్కులను సాధించి ఉద్యోగం సాధించాలంటే బిట్ బ్యాంక్‌లపై ఆధారపడే పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం లేదు. ప్రతి అంశంలోనూ విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడిన తర్వాత స్వీయ విశ్లేషణకు బిట్స్ రూపంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా దాదాపు అన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కచ్చితంగా జవాబులు తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు గుర్తించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది.
మాదిరి ప్రశ్నలు :







































#Tags