Chemistry Bit Bank for Competitive Exams: ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
మాదిరి ప్రశ్నలు
1. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు?
1) రూపాంతరత
2) విద్రావణీయత
3) స్ఫటికీకరణం
4) అంశికీకరణం
- View Answer
- సమాధానం: 1
2. కిందివాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) ఎర్ర ఫాస్ఫరస్
3) నల్ల ఫాస్ఫరస్
4) ఫాస్ఫీన్
- View Answer
- సమాధానం: 4
3. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది?
1) తెల్ల ఫాస్ఫరస్
2) నల్ల ఫాస్ఫరస్
3) ఎర్ర ఫాస్ఫరస్
4) పచ్చ ఫాస్ఫరస్
- View Answer
- సమాధానం: 3
4. ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) తెల్ల భాస్వరం
3) నల్ల భాస్వరం
4) పచ్చ భాస్వరం
- View Answer
- సమాధానం: 2
5. చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు?
1) ఫ్లోరోసెన్స్
2) ఫాస్ఫారిసెన్స్
3) ఫ్లాస్టిసెన్స్
4) ఉత్పతనం
- View Answer
- సమాధానం: 2
6. భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు?
1) గాలి
2) కిరోసిన్
3) నీరు
4) క్లోరోఫాం
- View Answer
- సమాధానం: 3
7. కిందివాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది?
1) నైట్రోజన్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) కార్బన్
- View Answer
- సమాధానం: 2
8. కింది వాటిలో బాహ్యణుక స్వభావం కలిగినది?
1) పచ్చ భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) స్కార్లెట్ భాస్వరం
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 2
9. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది?
1) కార్బన్
2) సల్ఫర్
3) సోడియం
4) ఫాస్ఫరస్
- View Answer
- సమాధానం: 4
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
10. ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు?
1) ఫాసీజా
2) ఫ్లోరోసెస్
3) ఫాస్ఫారిసెన్స్
4) కీలోసిస్
- View Answer
- సమాధానం: 1
11. పొగల తెరల (Smoke Screen)లో ఉపయోగించే సమ్మేళనం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) సల్ఫ్యూరికామ్లం
3) ఫాస్ఫీన్
4) అమ్మోనియా
- View Answer
- సమాధానం: 3
12. శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) ఫాస్ఫారికామ్లం
3) నైట్రికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
- View Answer
- సమాధానం: 2
13. నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే 'హోల్మె సంకేతాల్లో' వాడే సమ్మేళనం ఏది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫైడ్
4) ఫాస్ఫరస్ పెంటాక్సైడ్
- View Answer
- సమాధానం: 3
14. కిందివాటిలో అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండని పదార్థం ఏది?
1) ఎర్ర భాస్వరం
2) ఆంటిమొని సల్ఫైడ్
3) గాజుపొడి
4) పొటాషియం క్లోరేట్
- View Answer
- సమాధానం: 4
15. కిందివాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం?
1) గుడ్డు సొన
2) ఎముక మజ్జ
3) మొదడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
16. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది?
1) తెల్ల భాస్వరం
2) ఎర్ర భాస్వరం
3) నల్ల భాస్వరం
4) స్కార్లెట్ భాస్వరం
- View Answer
- సమాధానం: 2
17. అగ్గిపుల్లను గీసినప్పుడు జరిగే ప్రక్రియ?
1) పెట్టె పక్క భాగంలోని ఎర్ర భాస్వరం మండుతుంది
2) అగ్గిపుల్ల చివరలోని ఆంటిమొనీ సల్ఫైడ్ను మండిస్తుంది
3) కావలసిన ఆక్సిజన్‌ను పొటాషియం క్లోరేట్ అందిస్తుంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరేట్‌తో పాటు ఏముంటుంది?
1) అల్యూమినియం ట్రై క్లోరైడ్
2) ఆంటిమొనీ ట్రై సల్ఫైడ్
3) బిస్మత్ నైట్రేడ్
4) అల్యూమినియం ఫాస్ఫేట్
- View Answer
- సమాధానం: 2
19. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (P2O5) నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2)పైరో ఫాస్ఫారికామ్లం
3) ఫాస్ఫరస్ ఆమ్లం
4)మెటా ఫాస్ఫారికామ్లం
- View Answer
- సమాధానం: 1
చదవండి: Chemistry Practice Test
20. ఎలుకలను చంపడానికి ఉపయోగించే విష పదార్థం ఏది?
1) జింక్ ఫాస్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) జింక్ ఫాస్ఫైడ్
4) కాల్షియం ఫాస్ఫైడ్
- View Answer
- సమాధానం: 3
21. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి?
1) ఎరువులు
2) పురుగు మందులు
3) హెర్బిసైడ్లు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
22. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక..?
1) నత్రజని ఎరువు
2)ఫాస్ఫాటిక్ ఎరువు
3) పొటాషియం ఎరువు
4) కాల్షియం ఎరువు
- View Answer
- సమాధానం: 2
23. ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది?
1) కాల్షియం ఫాస్ఫైడ్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్పైట్
4) సోడియం ఫాస్ఫైట్
- View Answer
- సమాధానం: 2
24. కిందివాటిలో రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది? (గ్రూప్-2, 2008)
1) నైట్రోజన్ (N)
2) ఫాస్ఫరస్ (P)
3) పొటాషియం (K)
4) క్లోరిన్ (Cl)
- View Answer
- సమాధానం: 4
25. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ ΄ûడర్తోపాటు, పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) ఫాస్ఫారికామ్లం
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్
4) కాల్షియం ఫాస్ఫైడ్
- View Answer
- సమాధానం: 2
26. పంటి 'ఎనామిల్'లో ఉండే పదార్థం ఏది?
1) కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్
2) కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్
3) కాల్షియం ఫ్లోరైడ్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
27. మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది?
1) సల్ఫర్
2) ఫాస్ఫరస్
3) సిలికాన్
4) సెలినియం
- View Answer
- సమాధానం: 2
28. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది?
1) ఎముకలు
2) దంతాలు
3) కణజాలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. శరీరంలో విటమిన్ 'బి' సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది?
1) ఫాస్ఫరస్
2) సెలినియం
3) ఐరన్
4) మెగ్నీషియం
- View Answer
- సమాధానం: 1
చదవండి: Groups Practice Test
30. పళ్లపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది?
1) హైడ్రోక్లోరికామ్లం
2) నైట్రికామ్లం
3) సల్ఫ్యూరికామ్లం
4) ఫాస్ఫారికామ్లం
- View Answer
- సమాధానం: 4
31. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం?
1) ఇనుము(ఐరన్)
2) రాగి (కాపర్)
3) సోడియం
4) కాల్షియం
- View Answer
- సమాధానం: 4
32. మొక్కల్లోని ఆకుపచ్చ రంగుకు కారణం పత్రహరితం (క్లోరోఫిల్) అనే సంక్లిష్ట పదార్థం. ఇందులో ఉండే లోహం ఏది?
1) ఐరన్
2) కాల్షియం
3) మెగ్నీషియం
4) కోబాల్ట్
- View Answer
- సమాధానం: 3
33. సున్నపురాయి రసాయన నామం?
1) సోడియం కార్బొనేట్ (Na2CO3)
2) కాల్షియం కార్బొనేట్ (CaCO3)
3) కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
4) కాల్షియం ఆక్సైడ్ (CaO)
- View Answer
- సమాధానం: 2
34. సున్నపురాయి దేని వల్ల చలువరాయి (మార్బుల్)గా మారుతుంది?
1) అధిక ఉష్ణోగ్రత
2) అధిక వర్షపాతం
3) అధిక పీడనం(ఒత్తిడి)
4) అల్ప పీడనం
- View Answer
- సమాధానం: 3
35. టూత్ పేస్టుల్లో ఉపయోగించేవి?
1) CaCO3, CaO
2) CaCO3, MgCO3
3) CaCO3, Ca(OH)2
4) CaO, Ca(OH)2
- View Answer
- సమాధానం: 2
36. ఎముకల పొడిలో ఉండే కాల్షియం సమ్మేళనం ఏది?
1) కాల్షియం సల్ఫేట్
2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం కార్బొనేట్
4) కాల్షియం ఆక్సైడ్
- View Answer
- సమాధానం: 2
37. కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) చలువరాయి
2) సున్నపురాయి
3) సుద్ద
4) బొగ్గు
- View Answer
- సమాధానం: 4
38. కిందివాటిలో సరికాని జత ఏది?
1) సున్నపురాయి-కాల్షియం కార్బొనేట్ (CaCO3)
2) పొడిసున్నం - కాల్షియం ఆక్సైడ్ (CaO)
3) తడిసున్నం - కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)3)
4) సున్నపు తేట - కాల్షియం సల్ఫేట్ (CaSO4)
- View Answer
- సమాధానం: 4
39. ఇసుక, నీరు, సిమెంట్ (లేదా సున్నం) కలిసిన మిశ్రమానికి పేరు?
1) గచ్చు (మోర్టార్)
2) కాంక్రీట్
3) గట్టితనం ఉన్న కాంక్రీట్
4) తుప్పు
- View Answer
- సమాధానం: 1
చదవండి: Groups Study Material
40. కిందివాటిలో కాల్షియం కార్బొనేట్ ఉపయోగం కానిది?
1) మేలు రకం కాగితం తయారీలో వాడతారు
2) టూత్‌పేస్టులో సున్నితమైన అపఘర్షకంగా వాడతారు
3) 'చ్యూయింగ్ గమ్'లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు
4) ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడానికి వాడతారు
- View Answer
- సమాధానం: 4
41. కిందివాటిలో ఆమ్ల విరోధిగా వాడకూడని పదార్థం?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం సల్ఫేట్
4) సోడియం బై కార్బొనేట్
- View Answer
- సమాధానం: 3
42. నీటిని కలిపితే గట్టిపడే ఒక విశేష ధర్మాన్ని చూపే కాల్షియం పదార్థం ఏది?
1) సున్నపురాయి
2) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
3) చలువరాయి
4) బ్లీచింగ్ ΄ûడర్
- View Answer
- సమాధానం: 2
43. సిమెంట్ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు?
1) సున్నపురాయి
2) ఇనుప ఖనిజం
3) చలువరాయి
4) ఫ్లై యాష్
- View Answer
- సమాధానం: 1
44. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థం?
1) పాలు
2) మాంసం
3) నారింజ పండ్లు
4) టీ, కాఫీ
- View Answer
- సమాధానం: 1
45. ప్లాస్మాలో ఉండే లోహ అయాన్లు ఏవి?
1) కాల్షియం
2) సోడియం
3) పొటాషియం
4) మెగ్నీషియం
- View Answer
- సమాధానం: 1
46. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ..?
1) కాల్షియం ఫాస్ఫేట్
2) కాల్షియం కార్బొనేట్
3) కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్
4) కాల్షియం క్లోరైడ్
- View Answer
- సమాధానం: 3
47. మానవ శరీరంలో కాల్షియం పరిమాణం (సుమారుగా) ఎంత?
1) 25 g
2) 1200 g
3) 5000 g
4) 25 mg
- View Answer
- సమాధానం: 2
48. ఇళ్లకు వేసే సున్నం, సున్నపుతేటలో ఉండేది?
1) కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం ఆక్సైడ్
3) కాల్షియం హైడ్రాక్సైడ్
4) కాల్షియం క్లోరైడ్
- View Answer
- సమాధానం: 3
49. తడి సున్నం (స్లేక్డ్ లైమ్)ను నీటిలో అవలంబనం చేస్తే వచ్చే సున్నపు తేటను పాన్ తయారీలో తమలపాకుపై రాస్తారు. ఈ సున్నపు తేటకు మరో పేరు?
1) మిల్క్ ఆఫ్ లైమ్
2) బట్టర్ మిల్క్
3) మిల్క్ ఆఫ్ సోయా
4) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
- View Answer
- సమాధానం: 1
చదవండి: TSPSC Groups Exams Guidance
50. పోర్ట్లాండ్ సిమెంట్‌లోని ప్రధాన అనుఘటకాలేవి?
1) సున్నం, బొగ్గు, ఫ్లై యాష్
2) సున్నం, అల్యూమినా, జింక్
3) సున్నం, సిలికా, అల్యూమినా
4) సున్నం, అల్యూమినా, ఫ్లై యాష్
- View Answer
- సమాధానం: 3
51. ముత్యంలో ప్రధాన అనుఘటకాలేవి?
1) సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్
2) కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేటు
3) కాల్షియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్
4) కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బొనేట్
- View Answer
- సమాధానం: 2
52. కిందివాటిలో ఏది లోపించడం వల్ల ఎముకలు, దంతాలు బలహీనపడతాయి?
1) కాల్షియం
2) ఫాస్ఫరస్
3) ఫ్లోరైడ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
53. సిమెంట్ వేటి మిశ్రమం?
1) కాల్షియం కార్బొనేట్, కాల్షియం సిలికేట్
2) కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
3) ఇసుక, సున్నం, నీరు
4) జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్
- View Answer
- సమాధానం: 2
54. మార్బుల్ రసాయన సంకేతం ఏది?
1) Ca(OH)2
2) CaCO3
3) CaO
4) CaHCO3
- View Answer
- సమాధానం: 2
55. ఎమరాల్డ్‌లో ఉండే ప్రధాన మూలకం ఏది?
1) కాల్షియం
2) మెగ్నీషియం
3) బెరీలియం
4) సిలికాన్
- View Answer
- సమాధానం: 3
56. సిమెంట్‌కు జిప్సం కలపడానికి కారణం?
1) గట్టిదనం కోసం
2) బూడిద రంగు కోసం
3) నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా సెట్టింగ్ జరగడానికి
4) బరువు తూగడానికి
- View Answer
- సమాధానం: 3
57. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు?
1) తడిసున్నం
2) జిప్సం
3) సిమెంట్
4) మార్బుల్
- View Answer
- సమాధానం: 2
58. సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం?
1) బంగారం
2) సిల్వర్
3) మెగ్నీషియం
4) మెర్క్యూరీ
- View Answer
- సమాధానం: 3
59. బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) స్ట్రాన్షియం
4) బేరియం
- View Answer
- సమాధానం: 1
చదవండి: Groups Syllabus
60. టపాకాయలు కాల్చినప్పుడు సింధూర ఎరుపు రంగునిచ్చే లోహం ఏది?
1) మెగ్నీషియం
2) కాల్షియం
3) బేరియం
4) స్ట్రాన్షియం
- View Answer
- సమాధానం: 4
సబ్జెక్ట్ నిపుణులు