Telugu Methodology Bit Bank: TET/DSC ప్రత్యేకం తెలుగు మెథడాలజీ Bit Bank
1. కనీస అభ్యసనస్థాయి ప్రాతిపదికాంశాల్లో ఒకటి?
ఎ) అభ్యసనకాలం
బి) ఇంటిపని
సి) జవాబుదారీతనం
డి) బోధన సమయం
- View Answer
- Answer: సి
2. క్షుణ్ణ, విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్త పరిచే పఠనం?
ఎ) ఆదర్శ పఠనం
బి) మౌన పఠనం
సి) ప్రకాశ పఠనం
డి) మండూకష్ణతిపఠనం
- View Answer
- Answer: బి
3. నిలువు గీతలు, అడ్డ గీతలు, ఏటవాలు గీత లు, అర్ధచంద్రాకార గీతలు, వృత్తాలు మొద లైన వాటిని మొదట నేర్పి, తర్వాత రాత నేర్పే విధానం?
ఎ) ప్రాచీనం
బి) అతి పురాతనం
సి) ఆధునికం
డి) అతి నవీనం
- View Answer
- Answer: సి
4. బోధనాభ్యసన ప్రక్రియలను విశ్లేషించి ఉత్త మమైన వాటిని ఉపాధ్యాయులు స్వీకరించేందుకు తోడ్పడే శాస్త్రం?
ఎ) భాషా శాస్త్రం
బి) విద్యాతత్వ శాస్త్రం
సి) విద్యా సాంఖ్యక శాస్త్రం
డి) విద్యా సాంకేతిక శాస్త్రం
- View Answer
- Answer: డి
5. విద్యలో స్థాయి అంటే?
ఎ) దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలు
బి) అనతి కాలంలో సాధించాల్సిన గమ్యాలు
సి) నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమం
డి) నిర్ణీత సమయంలో సాధించాల్సిన ప్రగతి
- View Answer
- Answer: సి
6. విరామకాల సద్వినియోగానికి ఉపకరించేది?
ఎ) క్షుణ్ణ పఠనం
బి) విస్తార పఠనం
సి) దూర శ్రవణం
డి) దృష్ట లేఖనం
- View Answer
- Answer: బి
7. ఉక్త లేఖనం కలిగించే ప్రయోజనం?
ఎ) లేఖనంలో సమత
బి) రాతలో స్పష్టత
సి) లేఖనంలో వేగం
డి) రాతలో భంగిమ
- View Answer
- Answer: సి
8. విద్యాసాంకేతిక శాస్త్రం విద్యాబోధనకు అందించిన వరం?
ఎ) రేడియో
బి) టెలివిజన్
సి) టేప్ రికార్డర్
డి) భాషా ప్రయోగశాల
- View Answer
- Answer: డి
9. భాషా ప్రయోగశాలలో ప్రధాన టేపులు, అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసర మైన సామగ్రి ఉండే అర?
ఎ) పఠన అర
బి) నియంత్రణ అర
సి) సలహాదారు అర
డి) వినికిడి అర
- View Answer
- Answer: సి
10. భాషా ప్రయోగశాలలో ఉండే సామగ్రి?
ఎ) వినే బూత్
బి) సలహాదారు బూత్
సి) కంట్రోల్ రూం
డి) పైవన్నీ
- View Answer
- Answer: డి
11. ఓ చిత్రం లేదా దృశ్యాన్ని ప్రదర్శించి దానిపై విద్యార్థులను వ్యాసం రాయాలని కోరే పద్ధతి?
ఎ) సన్నివేశ పద్ధతి
బి) అభివర్ణన పద్ధతి
సి) అనుకరణ పద్ధతి
డి) క్రీడా పద్ధతి
- View Answer
- Answer: బి
12. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, స్వయంకృషి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేవి?
ఎ) పద క్రీడలు
బి) వైయక్తిక క్రీడలు
సి) వక్తృత్వపు పోటీలు
డి) సాహిత్య ప్రహేళికలు
- View Answer
- Answer: సి
13. విద్యార్థుల్లో భాషాభినివేశం, సాహిత్యాభి లాషను పెంపొందించేందుకు తోడ్పడే యాత్రలు?
ఎ) విజ్ఞాన యాత్రలు
బి) భాషా విహార యాత్రలు
సి) వినోద యాత్రలు
డి) విహార యాత్రలు
- View Answer
- Answer: బి
14. పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోట పని, పాఠశాల బ్యాంకు.. అనేవి?
ఎ) సాంస్కృతిక ఉద్యమాలు
బి) పర్యావరణ ఉద్యమాలు
సి) సంకీర్ణ ఉద్యమాలు
డి) భాషోద్యమాలు
- View Answer
- Answer: సి
15. సారస్వత సంఘాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం?
ఎ) సమయ పాలన నిర్వహణ తెలుస్తుంది
బి) సభా నిర్వహణ సామర్థ్యం అలవడుతుంది
సి) కాలం విలువ తెలుస్తుంది
డి) ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
- View Answer
- Answer: బి
16. స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి, బోధించిన అంశాన్ని వెంటనే పరీక్షిం చడానికి అనువైన పద్ధతి?
ఎ) పరీక్ష
బి) పరిపృచ్ఛ
సి) నికష
డి) అభిప్రాయావళి
- View Answer
- Answer: సి
17. కింది వాటిలో ఉత్తమ నికష లక్షణం?
ఎ) క్లుప్తత
బి) సమగ్రత
సి) స్వాభావికత
డి) లాక్షణికత
- View Answer
- Answer: ఎ
18. విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసి క, నైతిక, సామాజిక మూర్తిమత్వాన్ని నమో దు చేసి ప్రగతిని సూచించే రికార్డు?
ఎ) విద్యార్థి స్వీయ వివరాల రికార్డు
బి) క్యుములేటివ్ రికార్డు
సి) పాఠశాల ప్రవేశ రికార్డు
డి) పాఠశాల విడుదల రికార్డు
- View Answer
- Answer: బి
19. యూనిట్, నికషలతోపాటు తయారు చేయాల్సిన పట్టిక?
ఎ) సూచనల పట్టిక
బి) లక్ష్యాల భారత్వ పట్టిక
సి) వివరణ పట్టిక
డి) అంశాల పట్టిక
- View Answer
- Answer: బి
20. విద్యార్థుల సమాధాన పత్రాలను ఎవరు దిద్దినా, ఒకేవిధమైన మార్కులు రావాలనే మూల్యాంక లక్షణాన్ని ఏమంటారు?
ఎ) విశ్వసనీయత
బి) నిబద్ధత
సి) ప్రామాణికత
డి) విషయ నిష్ఠత
- View Answer
- Answer: సి
21. అంతర్గత మూల్యాంకనం చేసేది?
ఎ) ప్రధానోపాధ్యాయులు
బి) ఇతర పాఠశాల ఉపాధ్యాయులు
సి) సహ విద్యార్థులు
డి) బోధించిన ఉపాధ్యాయులు
- View Answer
- Answer: డి
22. విద్యార్థుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఉపకరించే పరీక్షా సాధనం?
ఎ) ప్రాయోగిక పరీక్ష
బి) పరిశీలన
సి) పరిపృచ్ఛ
డి) రాత పరీక్ష
- View Answer
- Answer: బి
23. లక్ష్యాధార బోధనలో సమ్ర΄ాధాన్యం ఉన్న అంశాలు?
ఎ) ఉద్దేశాలు – బోధన అభ్యసనం
బి) లక్ష్యాలు–మూల్యాంకనం–పర్యవేక్షణ
సి) లక్ష్యాలు–బోధనాభ్యసన కృత్యాలు – మూల్యాంకనం
డి) గమ్యాలు–మూల్యాంకనం – స్వీయ అధ్యయనం
- View Answer
- Answer: సి
24. ప–ఫ–బ–భలను ఏమంటారు?
ఎ) దంత్యాలు
బి) ఓష్ఠ్యాలు
సి) నాదాలు
డి) తాలవ్యాలు
- View Answer
- Answer: బి
25. వర్గ ద్వితీయ, చతుర్థాక్షరాలను ఏమంటారు?
ఎ) పరుషాలు
బి) సరళాలు
సి) వర్గయుక్కులు
డి) శ్వాసాలు
- View Answer
- Answer: సి
26. వర్గ పంచమాక్షరాలను ఏమంటారు?
ఎ) పరుషాలు
బి) స్థిరాలు
సి) నాదాలు
డి) అనునాసికాలు
- View Answer
- Answer: డి
27. పరుష, సరళేతర హల్లులను ఏమంటారు?
ఎ) శ్వాసాలు
బి) నాదాలు
సి) స్థిరాలు
డి) అంతస్థాలు
- View Answer
- Answer: సి
28. చాప – చలి– జాజి – జొన్న – జూదం పదాల్లో చ,జలను ఏమంటారు?
ఎ) దంత్యాలు
బి) తాలవ్యాలు
సి) పరుషాలు
డి) సరళాలు
- View Answer
- Answer: ఎ
29. చిలుక – చీమ – చేను – జిల – జీడి – జేజే పదాల్లో చ, జలను ఏమంటారు?
ఎ) దంత్యాలు
బి) సరళాలు
సి) తాలవ్యాలు
డి) నాదాలు
- View Answer
- Answer: సి
30. బోధనాంశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని విద్యార్థులకు అందించేం దుకు ఉ΄ాధ్యాయులకు తోడ్పడేవి?
ఎ) పారభాషిక పదకోశాలు
బి) నిఘంటువులు
సి) మాండలిక పదకోశాలు
డి) పరామర్శ గ్రంథాలు
- View Answer
- Answer: డి
31. అర్థ కాఠిన్యతను తొలగించడానికి ఉపాధ్యా యుడు తరగతి గదిలో అనుసరించే బోధన పద్ధతి?
ఎ) విశ్లేషణ పద్ధతి
బి) ప్రశ్నోత్తర పద్ధతి
సి) ఉదాహరణ వాక్య పద్ధతి
డి) వివరణ పద్ధతి
- View Answer
- Answer: సి
32. ఉపాధ్యాయుల మార్గదర్శనంలో... శోధనా దృక్పథంతో, స్వయంకృషితో విద్యార్థులు పూర్తిచేసేవి?
ఎ) తోటపనులు
బి) నిర్దేశ్యాలు
సి) అనువాదాలు
డి) తరగతి అలంకరణలు
- View Answer
- Answer: బి
33. వ్యాకరణ బోధనలో ఉదాహరణలు చెప్పి సూత్రాన్ని నిర్మింపజేసేందుకు అనుసరించే పద్ధతి?
ఎ) అర్థ వివేచన పద్ధతి
బి) శాస్త్ర పద్ధతి
సి) అనుమానోపపత్తి పద్ధతి
డి) నిగమోపపత్తి పద్ధతి
- View Answer
- Answer: సి
34. విద్యార్థుల వయసు, మానసిక స్థాయిని బట్టి సంవత్సరం వారీగా, తరగతి వారీగా విభజించేవి?
ఎ) క్రీడానుభవాలు
బి) అభ్యసనానుభవాలు
సి) బోధనానుభవాలు
డి) సామాజిక అనుభవాలు
- View Answer
- Answer: బి
35. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలను అనుమతించిన భారత రాజ్యాంగ అధికరణం?
ఎ) 342
బి) 343
సి) 345
డి) 346
- View Answer
- Answer: సి
36. శిశు గీతాలకు ఉండాల్సిన ప్రత్యేకతలు?
ఎ) గుణాత్మకత, యతి
బి) ప్రామాణికత, యతి
సి) లక్ష్యాత్మకత, ప్రాస
డి) లయాత్మకత, అనుప్రాసలు
- View Answer
- Answer: డి
37. పద్యబోధన ప్రధాన లక్ష్యాల్లో... రసానుభూతి, ఆనందానుభూతులతో΄ాటు పేర్కొనదగింది?
ఎ) ధ్వని విజ్ఞానం
బి) సముచిత వైఖరి
సి) హృదయ ద్రవీకరణం
డి) భాషాంతరీకరణం
- View Answer
- Answer: సి
38. గద్యబోధనలో రచయిత పరిచయం, పూ ర్వాంశ పరిచయం చేయడానికి ఉపాధ్యా యుడు అనుసరించాల్సిన బోధన పద్ధతి?
ఎ) చర్చా పద్ధతి
బి) వివరణ పద్ధతి
సి) ప్రశ్నోత్తర పద్ధతి
డి) ఉపన్యాస పద్ధతి
- View Answer
- Answer: బి
39. సమగ్ర పాఠ్య ప్రణాళిక అంటే?
ఎ) పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నింటికి సంబంధించింది
బి) ఒక రోజు పాఠ్యాంశానికి సంబంధించింది
సి) ఒక రోజు జరిగే బోధన కార్యక్రమానికి సంబంధించింది
డి) ఒక పాఠానికి లేదా ఒక యూనిట్‌కు సంబంధించింది
- View Answer
- Answer: డి
40. వ్యాఖ్యాన పద్ధతి ఏ ప్రక్రియ బోధనకు ఉపకరిస్తుంది?
ఎ) కథా బోధన
బి) నాటక బోధన
సి) వ్యాకరణ బోధన
డి) ఉపవాచక బోధన
- View Answer
- Answer: బి
41. నిగూఢార్థాన్ని తెలుసుకోవడం, సూచనలను అనుసరించడం అనే స్పష్టీకరణలున్న బోధన లక్ష్యం?
ఎ) భాషాభిరుచి
బి) రసానుభూతి
సి) అవగాహన
డి) సంస్కృతి–సంప్రదాయాలు
- View Answer
- Answer: సి
42. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్న ప్పుడు మొదట సాధించాల్సిన విలువలు?
ఎ) పరోక్ష విలువలు
బి) పరిమిత విలువలు
సి) హృదయగత విలువలు
డి) అగణిత విలువలు
- View Answer
- Answer: బి
43. ట – ఠ – డ – ఢ – ణలను ఏమంటారు?
ఎ) కంఠ్యాలు
బి) తాలవ్యాలు
సి) మూర్ధన్యాలు
డి) ఓష్ఠ్యాలు
- View Answer
- Answer: సి
44. శ – ష – స – హలను ఏమంటారు?
ఎ) ఊష్మాలు
బి) శ్వాసాలు
సి) నాదాలు
డి) తాలవ్యాలు
- View Answer
- Answer: ఎ
45. య – ర – ల – వలను ఏమంటారు?
ఎ) శ్వాసాలు
బి) సరళాలు
సి) అంతస్థాలు
డి) పరుషాలు
- View Answer
- Answer: సి
46. హల్లులకు మరోపేరు?
ఎ) స్వరాలు
బి) స్థిరాలు
సి) వ్యంజనాలు
డి) శ్వాసాలు
- View Answer
- Answer: సి
47. దంత్యోచ్ఛారణ ఉన్న హల్లులు?
ఎ) క – ఖ –గ – ఘ– ఙ
బి) త – థ – ద – ధ – న
సి) ప – ఫ – బ – భ – మ
డి) చ – ఛ – జ – ఝ – ఞ
- View Answer
- Answer: బి
48. ‘నయితాలీమ్’ విద్యావిధానంలో మాతృభాష మాధ్యమం మంచిదని ప్రశంసించిన విద్యావేత్త?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్
బి) కొమర్రాజు లక్ష్మణరావు
సి) రామచంద్ర శుక్లా
డి) మహాత్మా గాంధీ
- View Answer
- Answer: డి
49. విజయనగర కాలంలో అధికార భాషగా తెలుగు అమల్లో ఉందని తెలిపే గ్రంథం?
ఎ) ఆముక్త మాల్యద
బి) క్రీడాభిరామం
సి) రాయవాచకం
డి) మను చరిత్ర
- View Answer
- Answer: సి
50. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ) 1966
బి) 1974
సి) 1975
డి) 1978
- View Answer
- Answer: బి
51. అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు?
ఎ) డా. సి. నారాయణరెడ్డి
బి) టి. అనసూయమ్మ
సి) వావిలాల గోపాలకృష్ణయ్య
డి) యశోధారెడ్డి
- View Answer
- Answer: సి
52. అధికారభాషా సంఘం ప్రస్తుత అధ్యక్షుడు?
ఎ) డా.ఏ.బి.కె. ప్రసాద్
బి) డా. పరుచూరి గోపాలకృష్ణ
సి) డా. మాడుగుల నాగఫణిశర్మ
డి) మండలి బుద్ధ ప్రసాద్
- View Answer
- Answer: డి
53. తెలుగు అకాడమీ ప్రస్తుత సంచాలకుడు?
ఎ) డా. అనుమాండ్ల భూమయ్య
బి) ఆచార్య ప్రతాపరెడ్డి
సి) ఆచార్య కె. యాదగిరి
డి) డా. ఆవుల మంజులత
- View Answer
- Answer: సి
54. లఘూత్తర ప్రశ్నలను తయారుచేసే క్రమంలో ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం?
ఎ) ప్రతి ప్రశ్నను ఫలితాల ఆధారంగా రూపోందించాలి
బి) మాదిరి సమాధానాలు ముందే రాసి ఉంచుకోవాలి
సి) ప్రతి ప్రశ్నకు స్పష్టమైన ఒకే సమాధానం రావాలి
డి) కాదు, రాదు వంటి ప్రశ్నలను అడగాలి
- View Answer
- Answer: సి
55. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉపయోగపడే బోధనా పద్ధతి?
ఎ) చర్చా పద్ధతి
బి) ప్రశ్నోత్తర పద్ధతి
సి) వివరణ పద్ధతి
డి) ఉపన్యాస పద్ధతి
- View Answer
- Answer: బి