Telangana Group 4 Syllabus: గ్రూప్‌–4 మీ టార్గెటా... అయితే ముందుగా సిలబస్‌ తెలుసుకోండి

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పేపర్‌ 1, పేపర్‌ 2గా రాయాల్సి ఉంటుంది. మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్‌ ఉంటుంది. పేపర్‌ 1, 2లో ఏయే అంశాలు చదవాలి, వాటికి ఎన్ని మార్కులు కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట పేపర్‌–1 (మార్కులు 150) : పేపర్‌ 1 మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో గరిష్ట మార్కులు సాధించే దిశగా లక్ష్యం పెట్టుకోండి. పేపర్‌–1లో... జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం, పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం జాతీయోద్యమంపై ప్రత్యేక దష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు వీటిపై ప్రశ్నలుంటాయి. 
పేపర్‌ –2 (మార్కులు 150) : పేపర్‌ – 2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌), మెంటల్‌ ఎబిలిటీస్‌ (వెర్బల్, నాన్‌ వెర్బల్‌), లాజికల్‌ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ–అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ విత్‌ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్‌ ఎనాలసిస్‌ ఆఫ్‌ ఎ పాసేజ్, న్యూమరికల్, అర్థమెటికల్‌ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. 
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు..
నూతన జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కనుంది. జిల్లా కేడర్‌కు చెందిన గ్రూప్‌–4 ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే కేటాయించనున్నారు. మిగిలిన 5 శాతంలో కూడా స్థానిక అభ్యర్థులకే ఎక్కువ అవకాశం ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంది. మొత్తం 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాలలో అత్యధికం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉన్నాయి.

#Tags