TSPSC Group 2 New Exam Dates News 2024 : గ్రూప్–2,3 కొత్త ప‌రీక్ష తేదీల‌పై టీఎస్‌పీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 గ్రూప్–2 పోస్టుల‌ను.., 1388 గ్రూప్‌-3 భ‌ర్తీ చేయ‌నున్న విష‌యం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో నిర్వ‌హించనున్న‌ట్టు.. అలాగే గ్రూప్‌-3 ప‌రీక్ష‌లు న‌వంబ‌ర్ 24, 25వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు సోష‌ల్‌మీడియాలో ఈ వార్త నేడు వైర‌ల్ అయింది.

అయితే ఈ వార్త‌ను టీఎస్‌పీఎస్సీ ఖండించింది. ఈ న్యూస్‌లో నిజం లేద‌ని.. మేము గ్రూప్‌-2, 3 ప‌రీక్ష‌ల తేదీల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేద‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, 3 ప‌రీక్ష‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌ర‌గుతాయ‌ని తెలిపింది.

అయితే అభ్య‌ర్థులు మాత్రం..
TSPSC గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా డిసెంబ‌ర్‌కు వాయిదా వేయాలిన అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్న విష‌యం తెల్సిందే. TSPSC గ్రూప్-2లో 2000 పోస్టుల వ‌ర‌కు పెంచాలన్న హరీష్ రావు ఇటీవ‌లే డిమాండ్ చేసిన విష‌యం తెల్సిందే. అలాగే గ్రూప్‌-3లో 1388 పోస్టుల నుంచి 3000 పోస్టుల‌కు పెంచాల‌ని, అలాగే గ్రూప్‌-2 పోస్టులు 783 నుంచి 2000 వ‌ర‌కు పోస్టుల వ‌రకు పెంచాల‌ని అభ్య‌ర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

గ్రూప్-2, గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల‌ను 2024 డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాల‌ని.. జీవో నెం 46ను ర‌ద్దు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. ఇప్ప‌టికే చాలా మంది ఉద్యోగ సంఘం నాయ‌కులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి TSPSC గ్రూప్-2, గ్రూప్‌-3 ఉద్యోగాల‌ను పెంచాలంటూ విన‌తి ప‌త్రం కూడా ఇచ్చిన విష‌యం తెల్సిందే.

షెడ్యూల్ ప్ర‌కారం గ్రూప్‌-2, 3 ప‌రీక్ష తేదీలు ఇవేనా..?
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హింస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపిన విష‌యం తెల్సిందే.

#Tags