Free Coaching for Group 2: ఉచితంగా గ్రూప్‌–2 కోచింగ్‌.. చివ‌రి తేదీ ఇదే..

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని గిరిజన నిరుద్యోగులకు గ్రూప్‌–2 కోచింగ్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి మూ ర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా కేంద్రంలోని గిరిజన కోచింగ్‌ సెంటర్‌లో గ్రూప్‌–2 కోచింగ్‌ ఇ స్తామన్నారు. ఏదైన డిగ్రీ పూర్తి చేసి, ఆసక్తి కలి గిన నిరుద్యోగ యువతీ, యువకులు శిక్షణ పొందవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు బ యోడేటా తోపాటు విద్యార్హత, కుల ధ్రువీకరణపత్రం జిరాక్స్‌లతో ఈ నెల 5వ తేదీలోపు కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమశాఖ కా ర్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వి వరాలకు 8187899877 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చ‌ద‌వండి: Free Coaching for Group Exams: గ్రూప్‌ 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ

#Tags