APPSC Group1 Mains Selection Ratio 1:100 : గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే.. లేదా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ ) గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిలిమ్స్‌ నుంచి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని చాలా మంది అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వంకు విజ్జ‌ప్తి చేస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలకు ప్రిలిమ్స్‌ నుంచి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన విష‌యం తెల్సిందే.

ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో..
ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షలను అభ్యర్థులు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో.. అలాగే పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను ఆగస్టు 16వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఏపీపీఎస్సీ  కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 81 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రూప్‌- ప్రిలిమ్స్ 2024 ప‌రీక్ష‌కు ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైన విష‌యం తెల్సిందే.

#Tags