APPSC Group 1 Hall Ticket 2024 : గ్రూప్–1 హాల్ టికెట్లు విడుద‌ల‌.. 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షలు.. ఈ సారి పోటీ మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్–1 ప్రిలిమ్స్‌ పరీక్షను మార్చి 17వ తేదీన రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ గ్రూప్–1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మార్చి 10వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ గ్రూప్‌-1 స్క్రీనింగ్ పరీక్షలు పేపర్–1 ను ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు, పేపర్–2 ను మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలలో నిర్వహించనుంది.

ఒక్కొక్క పోస్టుకు పోటీ మాత్రం..
మొత్తం మీద ఈ 81 గ్రూప్‌-1 పోస్టుల‌కు 1,48,000 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 1827 మంది పోటీప‌డుతున్నారు. గ‌తంతో పోలిస్తే ఈ సారి పోటీ తీవ్ర‌త చాలా ఎక్కువ‌గానే ఉంది. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రాథమిక పరీక్షలో ఎటువంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ వ‌ర్గాలు తెలిపాయి.

2022లో ఏపీపీఎస్సీ 92 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. ఈ ఉద్యోగాల‌కు 1,26,449 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అలాగే 2018లో ఏపీపీఎస్సీ 182 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా.. ఈ పోస్టుల‌కు 1,14,473 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అంటే.. గ‌తంతో పాలిస్తే.. ఈ సారి 2023 గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లోనే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ 120 ప్రశ్నలు–120 మార్కులు); పేపర్‌–2 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 120 ప్రశ్నలు–120 మార్కులు). గ్రూప్‌-1 మెయిన్‌లో అయిదు పే­పర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. అవి.. పేపర్‌–1 జనరల్‌ ఎస్సే; పేపర్‌–2–ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం; పేపర్‌–3–పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా,ఎథిక్స్‌; పేపర్‌–4 ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి; పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

#Tags