TSPSC Group 1 Prelims Results 2024: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీ,కొడుకులు

కామేపల్లి: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించిన‌ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో తండ్రీకొడుకులు ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవికిరణ్‌ కామేపల్లి మండలం ఎంజే పల్లి హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌(ఇంగ్లిష్‌)గా పని చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు మైఖేల్‌ ఇమ్మానియేల్‌ కూడా గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రాసి మెయిన్స్‌కు ఒకేసారి అర్హత సాధించారు.

Supreme Court NEET Hearing Plea Live Updates: నీట్‌ పరీక్ష రద్దు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

గ్రూప్‌–1 పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడికి సహకారం అందిస్తూ, సలహాలు, సందేహాలు తీరుస్తూ తండ్రి కూడా ప్రిలిమ్స్‌ రాశారు. రిజర్వేషన్‌ కోటాలో ఐదేళ్లు, ఇన్‌ సర్వీస్‌ కోటాలో ఐదేళ్లు మినహాయింపు ఉండడంతో 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్‌ గ్రూప్‌–1 మెయిన్స్‌కు అర్హత సాధించడం విశేషం.

TSPSC Group 2 Exam Postponed 2024 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా.. కార‌ణం ఇదే..!

కాగా టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్‌-1 పోస్టులకు జూన్ 9వ తేదీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈసారి గ్రూప్‌-1 పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.అక్ట్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
 

#Tags