TSPSC Group 1 Prelims Exam Instructions 2024 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులకు రూల్స్ ఇవే.. వీటికి అనుమ‌తి లేదు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ జూన్ 9వ తేదీన (ఆదివారం) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌కు దాదాపు ఏర్పాట్లు అన్ని పూరైయ్యాయి.

563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రిలిమినరీ పరీక్షను TSPSC  నిర్వ‌హిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

హాల్‌ టికెట్లు మాత్రం..
గ్రూప్‌-1 ప్రిలిమ్స్  పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జూన్‌ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని TSPSC  తెలిపింది. 

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..
☛ జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని TSPSC తెలిపింది. అలాగే పది గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామమ‌న్నారు. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే ముందు అభ్యర్థులు హాల్‌టికెట్‌, ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్‌లోని సూచనల్ని జాగ్రత్తగా చూడాలి.

బయోమెట్రిక్ విష‌యంలో..

పరీక్ష కేంద్రం వద్ద బయో మెట్రిక్‌ ఉదయం 9.30గంటలకే మొదలవుతుంది. ఇన్విజిలేటర్‌ బయో మెట్రిక్‌ క్యాప్చర్‌ చేయకుండా అభ్యర్థుల పరీక్ష కేంద్రాన్ని వీడి వెళ్లొద్దు. ఒకవేళ ఎవరైనా తమ బయోమెట్రిక్‌లను ఇవ్వకపోతే.. వారి ఓఎంఆర్‌ జవాబు పత్రం మూల్యాంకనం చేయరు. బయో మెట్రిక్‌ రికార్డింగ్‌కు ఆటంకం కలిగించే విధంగా మెహెందీ, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు. 

వీటికి అనుమ‌తి లేదు..

కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్‌, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, వాచ్‌, మ్యాథమెటిక్స్‌ టేబుళ్లు, లాగ్‌బుక్‌లు, లాగ్‌ టేబుళ్లు, వాలెట్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్‌ ప్యాడ్‌, నోట్స్‌, ఛార్ట్స్‌, జ్యువెలరీ, ఇతర గ్యాడ్జెట్లు/ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకోవద్దు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిలేదు. బయటకు వెళ్లే ముందు ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. అభ్యర్థుల విలువైన వస్తువులను భద్రపరుచుకొనేందుకు కమిషన్‌ పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి స్టోరేజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయదని గమనించాలి.

#Tags