Mughal Gardens: కేంద్రం మరో పేరు మార్పు.... ఈ సారి మొఘల్‌ గార్డెన్స్‌ వంతు.. కొత్త పేరు ఏంటంటే...

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్న మొఘల్‌ గార్డెన్స్‌ పేరును మార్చేసింది. మొఘల్‌ గార్డెన్స్‌ పేరును అమృత్‌ గార్డెన్స్‌ గా మార్చింది.

మరోవైపు.. జనవరి 31 నుంచి అమృత్‌ ఉద్యాన్‌ లోకి ప్రజలను అనుమతించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.  
నెల పాటు అనుమతి...
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరై్తన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ థీమ్‌కు అనుగుణంగా మొఘల్‌ గార్డెన్స్‌ పేరును మార్చుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమృత్‌ ఉద్యాన్‌ ను ప్రారంభించనున్నారు. అనంతరం, 31వ తేదీ నుంచి అమృత్‌ ఉద్యాన్‌ లోకి ప్రజలకు ఎంట్రీ లభించనుంది. ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు అమృత్‌ ఉద్యాన్‌ లోకి ప్రవేశం కల్పించనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.
15 ఎకరాల్లో మొఘల్‌ గార్డెన్స్‌ ...
రాష్ట్రపతి భవన్‌ లో 15 ఎకరాల్లో మొఘల్‌ గార్డెన్స్‌ విస్తరించి ఉంది. దీన్ని మొఘల్‌ చక్రవర్తులు నిర్మించారు. ఇవి పెర్షియన్‌ శైలిలో నిర్మించిన తోటలు. ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్‌ బాగ్‌ నిర్మాణంలో కట్టినవి. సాధారణంగా ఈ గార్డెన్స్‌లో సరస్సులు, ఫౌంటేన్లు, కాలువలు కూడా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఎన్నో మొఘల్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. షాలిమర్ గార్డెన్స్‌(లాహోర్‌), ఢాకాలోని లాల్‌ బాగ్‌ కోట, శ్రీనగర్‌లోని షాలిమర్‌ గార్డెన్స్‌, మొఘల్‌ గార్డెన్స్‌లో ఉన్నాయి. తాజ్‌ మహల్‌ వద్ద కూడా మొఘల్‌ గార్డెన్స్‌ ఉంది.

#Tags