Bullet Proof Jacket: అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ..

తాము దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశామని డీఆర్‌డీఓ సంస్థ తెలిపింది..

సాక్షి ఎడ్యుకేషన్‌: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ హైయెస్ట్‌ థ్రెట్‌ లెవెల్‌–6లోనూ రక్షిణ కల్పిస్తుంది. తాము దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేశామని ఏప్రిల్‌ 25న డీఆర్‌డీవో ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Microsoft Invest: 1.7 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్న సత్యనాదెళ్ల.. ఎక్క‌డ‌, దేనికంటే..!?

ఈ జాకెట్‌ కొత్త డిజైన్‌తో రూపొందించినట్లు, దీని తయారీలో ప్రత్యేక మెటీరియల్‌ను ఉపయోగించడంతోపాటు, కొత్త పద్ధతిని అనుసరించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ – కాన్పూర్‌’ మందుగుండు సామగ్రి నుంచి రక్షణ కోసం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను అభివృద్ధి చేసింది.  

#Tags