List of Governors General And Viceroys Time Period In India: భారతదేశపు మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

ఆంగ్లేయులు భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం కోసం వచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఇక్కడ పరిపాలనపై పట్టు సాధించారు. ఇందులో భాగంగా అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. వైస్రాయ్‌లు, గవర్నర్ జనరల్స్.. ఇలా భారతదేశంలో వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టారు. బ్రిటిషర్ల నాటి ప్రభుత్వం 1833 చార్టర్‌ చట్టం ద్వారా బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవిని భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా మార్చింది. ఈ చట్టం ద్వారా అంతవరకు బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్‌ భారతదేశ తొలి గవర్నర్‌ జనరల్‌ అయ్యాడు.  బెంగాల్‌ మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌ నుంచి  చిట్ట చివరి వైస్రాయి వరకు ఎవరెవరు ఎంతకాలం పరిపాలించారు అన్నది ఓసారి పరిశీలిద్దాం. 
 

భారతదేశంలో గవర్నర్-జనరల్ & వైస్రాయ్ కాల వ్యవధి జాబితా

గవర్నర్-జనరల్ ఆఫ్ బెంగాల్ (1773-1833)

వారెన్ హేస్టింగ్స్ (1773-1785)
లార్డ్ కార్న్‌వాలిస్ (1786-1793)
లార్డ్ వెల్లెస్లీ (1798-1805)
లార్డ్ మింటో I (1807-1813)
లార్డ్ హేస్టింగ్స్ (1813-1823)
 లార్డ్ అమ్హెర్స్ట్ (1823-1828)

గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా (1833-58):

లార్డ్ విలియం బెంటింక్ (1828-1835)
లార్డ్ ఆక్లాండ్ (1836-1842)
లార్డ్ హార్డింజ్ I (1844-1848)
లార్డ్ డల్హౌసీ (1848-1856)

వైస్రాయ్ (1858-1947)

  • లార్డ్ కానింగ్ (1856-1862)
  • లార్డ్ జాన్ లారెన్స్ (1864-1869)
  • లార్డ్ లిట్టన్ (1876-1880)
  • లార్డ్ రిపన్ (1880-1884)
  • లార్డ్ డఫెరిన్ (1884-1888)
  • లార్డ్ లాన్స్ డౌన్ (1888-1894)
  • లార్డ్ కర్జన్ (1899-1905)
  • లార్డ్ మింటో II (1905-1910)
  • లార్డ్ హార్డింజ్ II (1910-1916)
  • లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ (1916-1921)
  • లార్డ్ రీడింగ్ (1921-1926)
  •  లార్డ్ ఇర్విన్ (1926-1931)
  • లార్డ్ విల్లింగ్డన్ (1931-1936)
  • లార్డ్ లిన్లిత్గో (1936-1944)
  • లార్డ్ వేవెల్ (1944-1947)
  • లార్డ్ మౌంట్ బాటన్ (1947-1948)
  • చక్రవర్తి రాజగోపాలాచారి (1948- 1950)

(రాజగోపాలాచారి:  1948 నుండి 1950 వరకు భారతదేశానికి చివరి గవర్నర్-జనరల్. దేశానికి  స్వాతంత్య్రం పొందిన తర్వాత ఏకైక,చివరి గవర్నర్ జనరల్ అయ్యారు. )

#Tags