YSR Rythu Bharosa Payment : వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి ఆర్థికసాయం ఏ విధంగా అందుతుంది?

ఈ పథకం కింద ప్రతి రైతు కుంటుంబానికి ఏడాదికి రూ.13,500 చొప్పున వ్యవసాయానికి పెట్టుబడిగా అందిస్తున్నారు.
YSR Rythu Bharosa Amount

కేంద్రప్రభుత్వ పథకమైన పీఎమ్‌ కిసాన్‌ కింద వచ్చే రూ. 6000 రూపాయలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం సాగు భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి మూడు వాయిదాలలో ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రూ. 13,500 లను సాయంగా అందిస్తుంది. అలాగే గిరిజన రైతులకు రూ.11,500 చొప్పును పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ విధంగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 లు అందుతుంది. ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను లాండ్ ఓనర్‌షిప్‌ డేటాబేస్‌ ద్వారా గుర్తించి, వారి ఖాతాల్లోకే నేరుగా జమ చేయడం జరుగుతుంది.

సున్నా వడ్డీకే..
అంతేకాకుండా ఈ పథకం కింద రైతులకు సున్నా వడ్డీకే ఋణాలు, రోజుకు 9 గంటల చొప్పున ఉచిత కరెంటు, ఉచితంగా బోర్లు వేయించడం, రైతులకు సంబంధించిన ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్ నుంచి మినహాయింపు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో పంట నష్టాన్ని అంచనా వేసి నెలరోజుల్లోపే పరిహారం చెల్లిస్తారు.

#Tags