Tesla unveils Optimus Gen 2: కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ జెన్ 2ను ఆవిష్కరించిన టెస్లా

అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్‌ రోబో ఇప్పుడు డ్యాన్స్‌ ఇరగదీస్తోంది.
Elon Musk unveils Tesla's Optimus Gen 2 Robot

 గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్‌ రోబో డెమో వీడియోను మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకున్నారు. 

Artificial Intelligence: కృత్రిమ మేధపై మథనం

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా..  తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్‌ షేర్‌ చేసిన వీడియో​లో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది.

Trai recommends regulatory framework for AI: సమతూకపు నియంత్రణ!

#Tags