GDP: 'జీడీపీ' అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా..?
ఇటీవల ఆర్‌బీఐ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రెండో త్రైమాసికంలో జీడీపీ 7.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అసలు ఈ జీడీపీ అంటే ఏమిటి..? దీన్ని ఎలా లెక్కిస్తారు..? దేశ ఆర్థిక వృద్ధిలో ఇది ఎంత ముఖ్యమైందో తెలుసుకుందాం.
జీడీపీ.. లెక్కింపు
జీడీపీను స్థూల దేశీయోత్పత్తి(Gross Domestic Product) అంటారు. సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం అంతిమ వస్తువుల విలువను ఆ దేశ జీడీపీగా పరిగణిస్తారు. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది. అందులో ఒక రోజు రూ.20 విలువ చేసే ఒక సబ్బు, రూ.10 విలువ చేసే చాకొలేట్, రూ.50 విలువ చేసే పుస్తకం అమ్మారు అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ రూ.80 లెక్కిస్తారు. అదే మాదిరి దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల అంతిమ విలువ ఆ దేశ జీడీపీ అవుతుంది.
మినహాయింపులు..
జీడీపీ లెక్కించేపుడు అన్ని ఉత్పత్తులను పరిగణించరు. ఉదాహరణకు చైనాకు చెందిన ఒక కంపెనీ ఏదైనా వస్తువును ఇండియాలో అమ్మితే అది మన జీడీపీ పరిధిలోకి రాదు. చైనా దేశపు జీడీపీలో చేరుతుంది. జీడీపీలో మాధ్యమిక వస్తువులను(వస్తు తయారీకి అవసరమయ్యే వాటిని) లెక్కించరు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే పరిగణిస్తారు.
S&P Global Ratings: ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా ప్రకారం భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతంటే..
ఉదాహరణకు కారులో వాడే టైర్, సీట్, లైట్లు.. వంటి వాటిని నేరుగా ఉపయోగించలేము. అయితే వాటిని కారు తయారీలో వాడుతారు. అంతిమంగా కారుకు ధర చెల్లిస్తాం. కాబట్టి టైర్, సీట్, లైట్లు.. వంటి మాధ్యమిక వస్తువులను జీడీపీలో లెక్కించరు. కారు ధరను జీడీపీలో చేరుస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే కాఫీ పొడి ఉందనుకుందాం. దాన్ని నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ ఉత్పత్తిగా ఉంటుంది. దాంతో కాఫీ ధరను జీడీపీలో చేరుస్తారు.
ఒక్కోసారి దేశ జీడీపీ పడిపోయిందని వింటూ ఉంటాం. అంటే మన దేశంలో తయారైన వస్తువులు స్థానికంగా ఎక్కువగా అమ్ముడవడం లేదన్నమాట. పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని అర్థం. కొంతకాలం ఇలాగే కొనసాగితే దేశీయ వస్తువులను కొనడంలేదు కాబట్టి కంపెనీలు కూడా వాటిని తయారు చేయవు. ఉత్పత్తి లేకపోతే కంపెనీలకు లాభాలు ఉండవు. దాంతో కొత్త ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు. తిరిగి జీడీపీ గాడిలోపడాలంటే దేశంలో తయారైన వస్తువులనే ఎక్కువగా కొనాలి. అప్పుడు కంపెనీలు వాటిని తయారు చేస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఎగుమతులు పెరుగుతాయి.
Employment Opportunities: నైపుణ్యాలు లేనివారికీ.. ‘ఇన్‌ఫ్రా’లో కోటి ఉద్యోగాలు!