GATE 2023: దరఖాస్తులు స‌మాచారం

Indian Institute of Technologyల్లో (IIT) M Tech, PhD చేసేందుకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో చేరేందుకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)కు ఐఐటీ కాన్పూర్‌ సన్నాహాలు చేస్తోంది.
గేట్ దరఖాస్తులు స‌మాచారం

సెప్టెంబర్‌ నెలాఖరు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఉండే వీలుంది. GATE 2023 పరీక్ష ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. బీటెక్, బీఎస్సీ, బీకాం, బీఏ పూర్తి చేసిన విద్యార్థులు గేట్‌ రాయవచ్చు. ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈసారి మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం ఐఐటీ కాన్పూర్‌ ఇప్పటికే ఓ వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసింది. గేట్‌ ర్యాంకు ఆధారంగానే పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటాయి. 2021లో 7.11 లక్షల మంది గేట్‌కు హాజరయ్యారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షల మంది గేట్‌కు హాజరవుతారని అంచనా. 

చదవండి: 

GATE 2023 నోటిఫికేషన్‌.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్స్‌... ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సైతం

Admissions in GATE: గేట్‌–2023 ..... ఎవరు అర్హులంటే..

#Tags