GATE 2024 Results: వెంకట నరేంద్ర ‘GATE’లో 724వ ర్యాంక్
విజయనగరం అర్బన్: పబ్లిక్ సెక్టార్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగాలకు, ప్రతిష్టాత్మకక ఇంజినీరింగ్ కళాశాలల్లో పీజీ కోర్సులో ప్రవేశాలకు చేపట్టే ‘గేట్’ పోటీ పరీక్షలో విజయనగరం పట్టణానికి చెందిన కొట్యాడ వెంకట నరేంద్ర 724వ ర్యాంక్ సాధించాడు.
కంప్యూటర్ సైన్స్ విభాగంలో 620 స్కోర్ తెచ్చుకోవడంతో ఈ ర్యాంక్ లభించిందని మార్చి 17న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
రాష్ట్రంలోని ఎన్‌ఐటీలో మూడో సంవత్సర ఇంజినీరింగ్ చదువుతున్న వెంకట నరేంద్ర పట్టణంలోని కేంద్రీయ విద్యాయలంలో ఇంటర్మీడియట్ చదివాడు.
తండ్రి వెంకట ప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి గంగలక్ష్మి గృహిణి. తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ తెచ్చుకున్నందుకు పలువురు అభినందనలు తెలిపారు.
---
#Tags