GATE 2024: నేడు, రేపు ‘గేట్‌’.. పరీక్ష హాలులోకి ఇవి అనుమతించం

సుజాతనగర్‌ : స్థానిక అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐఐటీ బెంగళూరు ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో గేట్‌ –2024 పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని కళాశాల యాజమాన్యం వారు తెలిపారు. శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో 45 మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే రెండో సెషన్‌ పరీక్షకు 123 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఇక ఆదివారం జరిగే పరీక్షకు రెండు విడతల్లో కలిపి 240 మంది హాజరు కానున్నారని తెలిపారు.

చదవండి: GATE 2024 Admit Cards Released- గేట్‌ పరీక్ష రాసేవాళ్లు.. ఇవి గుర్తుంచుకోండి

అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డుతో పాటు, ఏదైనా ఒరిజనల్‌ గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, రిస్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. 

#Tags