Temporary Teachers Posts : గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ఉపాధ్యాయ ఉద్యోగాలు..
నంద్యాల: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ఉపాధ్యాయులుగా పని చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయ కర్త డాక్టర్ శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జేఎల్ మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, హిస్టరీ 1, అలాగే పీజీటీ 1, మ్యాథ్స్ 1, టీజీటీ 3, బయోసైన్స్ 1, టీజీటీ మ్యాథ్స్ ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు జిల్లా కో-ఆర్డినేటర్ కార్యాలయంలో ఈనెల 28 నుంచి 30వ తేదీలోగా పనివేళల్లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. డీసీఓ కార్యాలయంలో 31వ తేదీ శనివారం ఉదయం 9గంటలకు డెమో ఉంటుందని తెలిపారు.
#Tags