Combined Hindi Translators Examination : ఎస్‌ఎస్‌సీలో పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్ విడుద‌ల‌..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 312.
»    పోస్టుల వివరాలు: జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌(జేహెచ్‌టీ), జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌(జేటీవో), జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌(జేటీ), సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌(ఎస్‌హెచ్‌టీ), సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌(ఎస్‌టీ).
»    అర్హత: పోస్టును అనుసరించి మాస్టర్‌ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్‌), డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఉండాలి. దీనితో పాటు ట్రాన్స్‌లేషన్‌(హిందీ/ఇంగ్లిష్‌) డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ(హిందీ/ఇంగ్లిష్‌)అర్హతతో పాటు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ ఉండాలి.
»    వయసు: 01.08.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
»    వేతనం: నెలకు సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌/సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400. ఇతర పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400.
»    పరీక్ష విధానం: పేపర్‌–1 (ఆబ్జెక్టివ్‌ టైప్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ మోడ్‌) సబ్జెక్ట్‌లు: జనరల్‌ హిందీ(100 ప్రశ్నలు/100 మార్కులు), జనరల్‌ ఇంగ్లిష్‌(100 ప్రశ్నలు/100 మార్కులు).
»    పరీక్ష వ్యవధి: 2 గంటలు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 02.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.08.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 25.08.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 04.09.2024 నుంచి 05.09.2024 వరకు.
»    కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(పేపర్‌–1): అక్టోబర్‌/నవంబర్, 2024.
»    వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Diploma Course Admissions : ఎన్‌ఐఈపీఐడీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే!

#Tags