Lecturer Posts at Junior College: ఏపీ గురుకుల జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు..
కేవీపల్లె: మండలంలోని గ్యారంపల్లె ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ కళాశాలలో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఆసక్తిగల అభ్యర్థులు తాత్కాలిక ఫుల్‌టైం గెస్ట్ లెక్చరర్‌గా పని చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. నెలసరి జీతం రూ. 18 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
#Tags