APPSC Notifications: ఏపీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.1,51వేల వేతనం

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవ‌ల‌ ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా ఏపీపీఎస్సీ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనికి అర్హులైన అభ్యర్థులు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 07 

అర్హత: బీఈ/బీటెక్ (సివిల్‌), బీప్లానింగ్‌/బీటెక్‌ (ప్లానింగ్‌), ఎంఏ (జాగ్రఫీ), పీజీ, టౌన్‌ ప్లానింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయసు: 01-07-2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370.

APPSC Recruitment: ఏపీలో ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 21.03.2024
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 10.04.2024

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

 

#Tags